KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం.
Brs Party: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరి అవుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తనతో కలిసివచ్చే పార్టీలతో కలిపి... ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ అధినేత.
KTR Plans for Revanth Reddy: ఈ నెల 17వ తేదీ నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.
Etela Rajender Fires On CM KCR: శామీర్‌పేట్‌లో రైతులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కలెక్టరేట్ ముందు ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైతులతో మాట్లాడి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
Dasoju Sravan Kumar Got Threatening Calls: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. ఈ కాల్స్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి.. శిక్షించాలని కోరారు.
YS Sharmila to KCR: 10 ఏళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ దొర అమలు చేసిన ఏ పథకం చుసినా.. "అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు" అన్నచందంగానే ఉంటోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. పేదలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ దొంగల పాలవుతున్నాయ్ అని మండిపడ్డారు.
మల్లు భట్టివిక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆయన చర్చించారు. కొల్లాపూర్ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
PMO Invites CM KCR: బీజేపి, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యమైన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ కీలక నేతలు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కంటే బీజేపీని ఎన్నుకోవాలని నరేంద్ర మోదీ ప్రజలను ఎలా కోరారో ఇటీవల చూశాం.
Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి అంతుచూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ పొంగులేటి అంటూ పోస్టర్లపై రాశారు. పూర్తి వివరాలు ఇలా..
ZP Chairman Koram Kanakaiah Resigns: ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్కు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Kalyana Laxmi Scheme Money: పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఒకటైన కళ్యాణలక్ష్మి పథకం ఎలా దుర్వినియోగం అవుతుందో కళ్లకు కట్టే సాక్ష్యం ఇది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి పథకంలో అధికార పార్టీ నాయకులు తమ చేతి వాటం చూపించారు. ఫుల్ డీటేల్స్ ఇదిగో..
YS Sharmila Slams KCR: అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీది ప్రజల పక్షం కాదు... ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం.. ఇంకా చెప్పాలంటే జనాలను పట్టి పీడించే బీఆర్ఎస్ పార్టీది దొంగల పక్షమే అవుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
MLA Rajaiah Vs Sarpanch Navya: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్యకు, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మధ్య జరుగుతున్న న్యాయ పోరాటంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.