Kishan Reddy Press Meet: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తోందని.. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao on Congress Guarantees: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ కాంగ్రెస్ దయతో రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
CM KCR Speech from Kollapur: తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను పాలమూరుకి వచ్చినప్పుడు ఇక్కడి ప్రాంత వాసులతో మాట్లాడుతూ, రాష్ట్రం వస్తేనే మనల్ని పట్టి పీడిస్తున్న సకల దరిద్రలు విడిచిపెడతాయని అన్నానని.. మన రాష్ట్రం మనకు వస్తేనే మన హక్కులు, మన నీళ్లు మనకు దక్కుతాయని చెప్పానని గుర్తుచేసుకున్నారు.
ఖుషి సినిమా తరువాత సమంత సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత గురించి ఒక పుకారు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత పాలిటిక్స్ లోకి రానుంది అని.. అదెంత వరకు నిజమో తెలుసుకుందాం!
BRS MLC Kalvakuntla Kavitha: నిజామాబాద్ : అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్‌కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ గౌతం ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్‌లో చేయగలరా అని ప్రశ్నించారు.
Revanth Reddy Counter to KTR: అమరుల తల్లుల కడుపుకోత గుర్తించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సకుటుంబ సమేతంగా తెలంగాణకు వస్తుంటే.... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీతో అంటకాగి కుట్రలు చేస్తున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
31 పంపులను ఏర్పాటు చేయాల్సింది.. కేవలం ఒక్క పంపును ప్రారంభించి.. ప్రాజెక్ట్ పూర్తయిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Medical Colleges In Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోందని.. ఈ నెల 15వ తేదీన 9 మెడికల్ కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister Prashanth Reddy Comments on BJP and Congress: తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు.
Why KCR Is Contesting From Kamareddy: కామారెడ్డి నుండి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు.
YS Sharmila slams CM KCR: పనులు ఆగిపోయి పడావుపడ్డ ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనేలా పాలమూరు, రంగారెడ్డి ప్రజలను భ్రమలకు గురయ్యేలా చేస్తున్నాడు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Double bed room flats: కేసీఆర్ పూర్వీకుల స్వస్థలం ఇక్కేడేనని.. అందుకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓవైపు చెబుతుండగా.. మరోవైపు తాజాగా కురిసిన భారీ వర్షాలకు అదే నియోజకవర్గం పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వాన నాటికి మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనియాంశమైంది.
Palamuru - Rangareddy Lift Irrigation Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామి వారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందాం అని సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Revanth Reddy About CWC Meeting in Hyderabad: సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.సీడ్లూసీ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి అని అన్నారు.
MLA Rajaiah Meet With Damodar Raja Narasimha: కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య రహాస్యంగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Tummala Nageshwar Rao To Join Congress Party ?: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అధికారికంగా గోదావరి జలాలను వదిలి.. అదే వేదికపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపి, రాజకీయాల నుంచి విరమించాలన్నదే తన కోరిక అన్నారు. దాని కోసమే ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నట్లు ప్రకటించారు.
CM KCR's Sisters Ties Rakhi: రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది.
Minister Harish Rao About CM KCR: కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ గుడ్డిపాలను సరిచేసుకోవాలంటూ మంత్రి హరీశ్ రావు సూచించారు. కర్ణాటకలో ప్రజలకు బీజేపీ పాలనపైనే కక్కొస్తేనే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు.
Revanth Reddy satires on LPG cylinder Price Cut: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
Vemulawada MLA Chennamaneni Ramesh Babu meets CM KCR: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ( వ్యవసాయ రంగ వ్యవహారాలు) గా తనను నియమించినందుకు వేములవాడ శాసన సభ్యులు డా. చెన్నమనేని రమేశ్ బాబు బుధవారం ప్రగతి భవన్‌కి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.