Year Ender 2021: Virat Kohli lost T20 and ODI Captaincy: క్రికెట్ అభిమానులకు టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడమే కాదు.. సెంచరీలను మంచినీరు తాగినంత సులువుగా చేస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు బాదిన కోహ్లీ.. ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తర్వాత తన ఆట, కెప్టెన్సీతో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా కీర్తించబడ్డాడు. అయితే గతకొంతకాలంగా విరాట్ విఫలవుతున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా పూర్తిగా తేలిపోయాడు. ఈ క్రమంలోనే 2021 సంవత్సరం కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. 2021 కోహ్లీకి దాదాపుగా నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. ప్రస్తుతం టెస్ట్ సారథిగా ఉన్న కోహ్లీకి 2021 (Year Ender 2021) ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చిందో ఓసారి చూద్దాం.
అగ్రస్థానం పాయే:
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 28.41 సగటుతో మాత్రమే పరుగులు చేయగలిగాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 483 పరుగులు చేశాడు. గతేడాది మాదిరిగానే 2021లో కూడా ఒక్క సెంచరీ నమోదు చేయలేదు. టెస్టులో విరాట్ ఆరో స్థానంలో (ICC Rankings) ఉన్నాడు. ఈ ఏడాది విరాట్ కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. 43 సగటుతో రన్స్ చేశాడు. ఈ క్రమంలోనే వన్డేలో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో మాత్రం కోహ్లీ పర్వాలేదనిపించాడు. విరాట్ 74.75 సగటుతో పరుగులు చేశాడు. అయినా టాప్ -10లో మాత్రం లేడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి:
రెండు సంవత్సరాలుగా అద్భుతంగా ఆడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరిన టీమిండియా.. తుది మెట్టుపై బోల్తాపడింది. ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో నార్తాంప్టస్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్‌లో 217, రెండో ఇన్నింగ్‌లో 170 పరుగులే చేసి ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన కోహ్లీసేన భారీ మూల్యం చెల్లించుకుంది. దాంతో విరాట్ కోహ్లీ ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) గెలుచుకునే అవకాశం కోల్పోయాడు.
Also Read: Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి
బెంగళూరుకు కప్ అందించలేదు:
సెప్టెంబర్-అక్టోబర్ మాసంలో విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఓ కీలక మలుపు జరిగింది. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోబోతోన్నట్లు కోహ్లీ ముందుగా ప్రకటించాడు. ఈ షాక్ నుంచి అభిమానులు తేరుకోక ముందే మరో సంచలన ప్రకటన చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా (RCB Captain) కూడా తనకు ఇదే చివరి ఐపీఎల్ (IPL) టోర్నమెంట్ అని ప్రకటించాడు. అయితే సుదీర్ఘ కాలంగా బెంగళూరుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఈసారి కప్ కొట్టాలని అందరూ కోరుకున్నారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. ఎప్పటిలానే ఈసారి కూడా ఉత్తచేతులతోనే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కోహ్లీ బెంగళూరుకు కప్ అందించే కల.. ఓ కల లానే మిగిలిపోయింది.
ప్రపంచకప్‌లో లీగ్ దశ నుంచే:
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఐపీఎల్ టోర్నీలో కప్ కొట్టకపోయినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు అయినా కప్ అందించాలని ఫాన్స్ మరోసారి కోరుకున్నారు. ఐపీఎల్ అనంతరం వారంలో మొదలైన మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 (T20 World Cup) మొదటి మ్యాచులోనే మనోళ్లు నిరాశపరిచారు. ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఘోర పరాజయంను ఎదుర్కొన్నారు. ఆపై న్యూజీలాండ్ జట్టుపై ఓడిపోయి సూపర్ 12 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకున్నారు. ఆపై మూడు విజయాలు అందుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. లీగ్ దశ నుంచే భారత్ నిష్క్రమించడంతో.. కోహ్లీ మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలిచే సదావకాశాన్ని కోల్పోయాడు.
Also Read: Bank offers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు బంఫర్ ఆఫర్.. 2 లక్షల వరకు ప్రయోజనం
వన్డే కెప్టెన్సీ పాయే:
టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం న్యూజీలాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీసుకు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ.. రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చి మ్యాచును గెలిపించాడు. ఇంతలోనే బీసీసీఐ (BCCI) అతడికి ఊహించని షాక్ ఇచ్చింది. వన్డే కెప్టెన్సీ (ODI Captaincy) నుంచి కోహ్లీని తప్పించి.. రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. మొత్తానికి 2021 కోహ్లీకి ఏమాత్రం కలిసిరాలేదు. అయితే ఏడాది కోహ్లీకి ఓ మంచి జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ-అనుష్క దంపతులు వామికాకు జన్మనిచ్చారు. అదొక్కటి తప్ప ఈఏడాది కోహ్లీకి నిరాశనే మిగిల్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి