Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన ఉనద్కత్.. తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్

Jaydev Unadkat Hat Trick Against Delhi: సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ముగ్గురు బ్యాట్స్‌మెన్లను డకౌట్‌ చేసి హ్యాట్రిక్ సాధించాడు. రంజీల్లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 04:28 PM IST
Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన ఉనద్కత్.. తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్

Jaydev Unadkat Hat Trick Against Delhi: భారత బౌలర్ జయదేవ్ ఉనద్కత్ చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2022-23 మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. సౌరాష్ట్ర, ఢిల్లీ మధ్య మంగళవారం నుంచి రాజ్‌కోట్‌లో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవర్‌లోనే జట్టుకు శుభారంభం అందించాడు. 

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జయదేవ్ ఉనద్కత్ సౌరాష్ట్ర తరఫున మొదటి ఓవర్ చేశాడు. తొలి ఓవర్ మూడో బంతికి ధ్రువ్ షోరేని సున్నాకే అవుట్ చేశాడు. నాలుగో బంతికి వైభవ్ రావల్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆపై ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ యష్ ధుల్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. 

రంజీ ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు రంజీల్లో ఏ బౌలర్ కూడా తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించలేదు. ఉనద్కత్ ధాటికి ఢిల్లీ జట్టు 30 ఓవర్లలో 108 పరుగులు చేసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. సౌరాష్ట్ర తరఫున కెప్టెన్ ఉనద్కత్ 30 ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టాడు. ఉనద్కత్‌తో పాటు చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ ఒక్కో వికెట్ తీశారు. 

53 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన ఢిల్లీని హృతిక్ షోకీన్, శివంక్ వశిష్ట్‌ గట్టేక్కించారు. ఇద్దరు సౌరాష్ట్ర బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. వీరిద్దరి పోరాటంతోనే ఢిల్లీ స్కోరు 100 దాటింది. షౌకీన్ 76 బంతుల్లో 57 పరుగులు, శివాంక్ 24 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 

ఇక ఇటీవలె బంగ్లాదేశ్ టూర్‌లో 12 ఏళ్ల తర్వాత టెస్టుల్లో టీమిండియా తరఫున జయదేవ్ ఉనద్కత్ ఎంట్రీ ఇచ్చాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 7 వన్డేల్లో 8 వికెట్లు, 10 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జయదేవ్.. 3 వికెట్లు తీశాడు. 

Also Read: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న బంగారం ధరలు..!    

Also Read: YSRCP: చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ డిమాండ్.. సరికొత్త నిరసనకు పిలుపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News