Johnson Charles Liton Das Replacement: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి హార్డ్ హిట్టర్ ఎంట్రీ ఇచ్చాడు. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ అనుకోకుండా జట్టు నుంచి వెళ్లిపోవడంతో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాన్సన్ చార్లెస్‌తో భర్తీ చేసింది. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా లిట్టన్ దాస్ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. జాన్సన్‌కు 50 లక్షల రూపాయలు వెచ్చించ్చి కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. చార్లెస్ చేరికతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడుతుందని కోల్‌కతా భావిస్తోంది.
వికెట్ కీపర్ అయిన చార్లెస్.. హార్డ్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. వెస్టిండీస్ తరఫున 41 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 971 రన్స్ చేశాడు. 2016లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో చార్లెస్ సభ్యుడు. ఆ ప్రపంచకప్‌లో భారత్‌తో ముంబైలో జరిగిన సెమీ-ఫైనల్‌లో మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. 36 బంతుల్లో 52 పరుగులు చేయడంతో టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగింది.
రూ.50 లక్షలు చెల్లించి కేకేఆర్ ఈ స్టార్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది. వన్డేల విషయానికి వస్తే.. 48 మ్యాచ్‌లు ఆడగా.. 1283 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చార్లెస్ ఇప్పటివరకు మొత్తం 224 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 5607 రన్స్ చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యుత్తమ స్కోరు 118 పరుగులుగా ఉంది. వికెట్ కీపింగ్‌లో కూడా చార్లెస్‌కు మంచి రికార్డు ఉంది. టీ20 ఫార్మాట్‌లో 5 స్టంప్ అవుట్‌లు చేయడంతోపాటు 82 క్యాచ్‌లు కూడా పట్టాడు.
అటు కోల్‌కతా విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆటతీరు ఏ మాత్రం బాగోలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొందింది. పాయింట్స్ టేబుల్‌లో కింది నుంచి మూడోస్థానంలో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గాల్సిందే. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగడంతో కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు. నేడు ఎలాగైనా గెలిచి లెక్క సరిచేయాలని చూస్తోంది.
Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి