Shikhar Dhawan sold to Punjab Kings for Rs 8.25 crores: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం సందడి షురూ అయింది. ఐపీఎల్ గవర్కింగ్ కౌన్సిల్ మెంబెర్ బ్రిజేష్ పటేల్ డ్రా తీయగా.. ఇండియన్ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటి ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. వేలంలో గబ్బర్‌ను 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ధావన్ బేస్ ప్రెస్ 2 కోట్లు కాగా.. 8.25 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
శిఖర్ ధావన్ కోసం ముందుగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. రాజస్థాన్ 5 కోట్ల వరకు పాడి డ్రాప్ కాగా.. ఢిల్లీ చివరి వరకు పోటీ పడింది. చివరలో కింగ్స్ పంజాబ్ జట్టు ఢిల్లీకి గట్టి పోటీ ఇచ్చి భారీ మొత్తానికి ధావన్‌ను కైవసం చేసుకుంది. లోకేష్ రాహుల్ పంజాబ్ జట్టును వీడడంతో ఓపెనర్ అవసరం ఆ జట్టుకు ఏర్పడింది. అందుకే ఢిల్లీతో పోటీపడి మరీ గబ్బర్‌ను దక్కించుకుంది.
శిఖర్ ధావన్ గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. 192 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధావన్.. 5784 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గబ్బర్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావడం అతడికి కలిసొచ్చే అంశం. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీల మోత మోగించడం అతడి ప్రత్యేక శైలి. భారత్ తరఫున గబ్బర్ 34 టెస్టులు, 148 వన్డేలు, 68 టీ20లు ఆడాడు.
Congratulations to @SDhawan25 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/8LepZC7F2R
— IndianPremierLeague (@IPL) February 12, 2022
ఐపీఎల్ మెగా వేలంకు పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హాజరు కాలేదు. ఇది బ్యాడ్‌న్యూస్ అని చెప్పాలి. ఇంతకముందు ఎప్పుడు వేలం జరిగినా ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. తనదైన సొట్టబుగ్గల నవ్వుతో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటే.. ఎంతో సందడిగా ఉండేది. అలాంటి నవ్వులు ఇప్పుడు ఫాన్స్ మిస్ అయ్యారు.
Also Read: Prema Entha Madhuram: వాలెంటైన్స్ డే స్పెషల్.. రియల్ కపుల్స్‌తో ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్..
Also Read: Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లొద్దామా..! పూర్తి వివరాలివిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook