Punjab Kings Captain: శిఖర్ ధావన్‌కు నిరాశే.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అతడే! త్వరలోనే అధికారిక ప్రకటన!!

Mayank Agarwal likely to captain Punjab Kings: ఐపీఎల్ 2022లో పంజాబ్‌ కింగ్స్ కొత్త సారథిగా మయాంక్‌ అగర్వాల్‌ను నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను శిఖర్ ధావన్‌కు అప్పగించారట.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 03:58 PM IST
  • శిఖర్ ధావన్‌కు నిరాశే
  • పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అతడే
  • పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌
Punjab Kings Captain: శిఖర్ ధావన్‌కు నిరాశే.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అతడే! త్వరలోనే అధికారిక ప్రకటన!!

Mayank Agarwal likely to captain for Punjab Kings in IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత రెండేళ్లుగా పంజాబ్‌ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌.. ఈసారి కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్ 2022 వేలానికి ముందు లక్నో అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. లక్నో జట్టుకు రాహుల్ సారథ్యం కూడా వహించనున్న నేపథ్యంలో.. ఐపీఎల్ 2022లో పంజాబ్‌కు కొత్త కెప్టెన్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మయాంక్‌ అగర్వాల్‌ను నూతన కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఐపీఎల్ 2022 మెగా వేలంకు ముందు మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లను మాత్రమే పంజాబ్‌ కింగ్స్ అట్టిపెట్టుకుంది. అత్యధిక పర్స్ వాల్యూ ఉన్న పంజాబ్ ప్రాంచైజీ.. ఇటీవల బెంగళూరులో జరిగిన వేలంలో శిఖర్‌ ధావన్‌, కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, భానుక రాజపక్స, ఓడియన్ స్మిత్, రాహుల్‌ చహర్‌, నాథన్ ఎలిస్, సందీప్ శర్మ, షారుక్‌ ఖాన్‌, హర్‌ప్రీత్ బ్రార్ లాంటి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో కెప్టెన్‌గా గబ్బర్ పేరు తప్ప మరో ఆటగాడు కనిపించలేదు.

పంజాబ్‌ కింగ్స్ కొత్త సారథిగా శిఖర్ ధావన్‌కు అవకాశం ఇస్తారని భావించినా.. జట్టు యాజమాన్యం మాత్రం మయాంక్‌ అగర్వాల్‌ వైపే మొగ్గు చూపిందని ఓ అధికారి తెలిపారు. మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు ధావన్‌కు అప్పగిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా కేల్ రాహుల్‌కు జోడీగా మయాంక్ అదిరిపోయే బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. 

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా సహా యజమానిగా వ్యవహరిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ ప్రాంచైజీ ఐపీఎల్‌లో 2014లో ఫైనల్‌ చేరింది. అది మినహా మళ్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన దాఖలు లేవు. ముఖ్యంగా గత మూడు సీజన్లలో పంజాబ్‌ ఆరో స్థానంలో నిలుస్తూ వచ్చింది. గతేడాది పేరు మార్చుకున్నా.. పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. మంచి ఆటగాళ్లు ఉన్న ఈసారైనా పంజాబ్‌ ముందుగా ప్లే ఆఫ్స్ చేరాలని అందరూ కోరుకుంటున్నారు. ఐపీఎల్ 2022 మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్‌ తొలి వారంలో ఆరంభం అయ్యేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. 

Also Read: Flipkart iPhone SE Sale: రూ.40,000 విలువైన iPhone ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.13 వేలకే విక్రయం!

Also Read: Eagle vs Snake Fight: గద్దపై ప్రతికారంతో విరుచుకుపడిన చిన్న పాము - వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News