Ind vs Eng: Ben Stokes సంచలన వ్యాఖ్యలు, టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ దారుణ వైఫల్యానికి Weight Lossకు లింక్ పెట్టిన స్టార్ ఆల్ రౌండర్

Ind vs Eng: Ben Stokes Reveals Weight Loss Of England Players | ఒకవేళ మ్యాచ్‌లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం, ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, దారుణంగా వైఫల్యం చెందితే అంతకుమించిన కారణాలు చెబుతారు. నాలుగో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విస్తుగొలిపే విషయాలను తెరమీదకి తెచ్చాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 9, 2021, 04:57 PM IST
  • ఒకవేళ మ్యాచ్‌లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం
  • ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, వైఫల్యం చెందితే సంచలన వ్యాఖ్యలు
  • ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చాడు
Ind vs Eng: Ben Stokes సంచలన వ్యాఖ్యలు, టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ దారుణ వైఫల్యానికి Weight Lossకు లింక్ పెట్టిన స్టార్ ఆల్ రౌండర్

Ind vs Eng: Ben Stokes Reveals Weight Loss Of England Players : క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి టెస్టు మ్యాచ్‌లు. ఒకవేళ మ్యాచ్‌లు గెలిస్తే సత్తా చాటుకున్నామని కామెంట్లు చేయడం, ఓటమి ఎదురైతే చిన్న కుంటి సాకులు, దారుణంగా వైఫల్యం చెందితే అంతకుమించిన కారణాలు చెబుతారు. ప్రస్తుతం టీమిండియా చేతిలో టెస్టు సిరీస్‌లో 3-1 తేడాతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి అదే తీరుగా ఉంది.

తొలి టెస్టులో ఘన విజయం సాధిస్తే భారత్ గడ్డమీద టీమిండియాను చిత్తుచేశామని గర్వపూరిత వ్యాఖ్యలు చేశారు. రెండో టెస్టులో టీమిండియా సంచలన విజయం నమోదు చేయగా స్పిన్ పిచ్‌లు ఏర్పాటు చేశారు, అవి ఆతిథ్య జట్టుకు మేలు చేశాయని ఇంగ్లాండ్ జట్టుతో పాటు మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, కెవిన్ పీటర్సన్ లాంటి ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. మూడో టెస్టులో ఓటమితో టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని వాపోయారు. ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(England All-Rounder Ben Stokes) విస్తుగొలిపే విషయాలను తెరమీదకి తెచ్చాడు.

Also Read: India vs England: టీ20 సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ, గాయం నుంచి కోలుకోని పేసర్ Jofra Archer

5 కేజీలు తగ్గాను..
సిరీస్‌లో కాస్త నిలకడగా రాణించిన ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ మాత్రమే. అయితే భారత్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇంగ్లాండ్ జట్టు ఎండ వేడిమిని భరించలేకపోయిందని స్టోక్స్ పేర్కొన్నారు. తానైతే వారంలో 5 కిలోలు తగ్గిపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. డామ్ సిబ్లీ అయితే 4 కేజీలు తగ్గా, స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ సైతం 3 కేజీల వరకు బరువు తగ్గిపోయాడని బెన్ స్టోక్స్ చెప్పాడు. జాక్ లీచ్ అధిక వేడిమిని తట్టుకోలేకపోయాడని, పలు సందర్భాలలో టాయిలెట్‌కు పరిమితమయ్యాడని విస్తుగొలిపే విషయాలు చెప్పుకొచ్చాడు.

Also Read: IPL 2021 Schedule: ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలు విడుదల చేసిన BCCI

తమ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ఆడేందుకు యత్నించారని, అయితే తమకు అనుకూల ఫలితాలు రాలేదన్నాడు. అదే సమయంలో టీమిండియా(Team India)లో ప్రతి ఒక్కరూ ఈ వాతావరణంలో స్వేచ్ఛగా ఆడగలిగారని, ముఖ్యంగా రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు. ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్ల విమర్శలను అంతగా పట్టించుకోవడం లేదని, కేవలం తమ ప్రదర్శన మెరుగు చేసుకోవడంపైనే ఫోకస్ చేస్తుందన్నాడు. తమ జట్టులో చాలా మంది ఆటగాళ్లకు భారత్‌లో ఇదే తొలి టెస్ట్ సిరీస్ అని తెలిపాడు. కెప్టెన్, కోచ్ ఆలోచనలు, సమష్టిగా ఆటగాళ్లు శ్రమిస్తే ఫలితాలు సాధ్యమని బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.

Also Read: IPL 2021 MI Schedule: ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News