World Cup 2023: క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోనిది నిన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ఒకడు కాదు..ఇద్దరు హీరోలు. ఒకడు ఆఫ్ఘన్ హీరో అయితే మరొకడు ఆసీస్ హీరో. విజయం ఆసీస్‌ను వరించినా ఆఫ్ఘన్లను అంత తేలిగ్గా తీసుకోకూడదని వెల్లడి చేసిన మ్యాచ్ అది. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసిన ఇబ్రహీం జద్రాన్ ఓ హీరో అయితే, ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించిన మ్యాక్స్‌వెల్ మరో హీరో.
ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఊహించని ఫలితాన్నిచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆప్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాకు 291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ టాప్ ఆర్జర్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన ఆఫ్ఘన్ ఆటగాడిగా నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో స్కాట్లండ్‌పై ఆఫ్ఘన్ ఆటగాడు సమీఉల్లా షిన్వారీ చేసిన 96 పరుగుల టాప్ స్కోర్‌ను దాటేశాడు. ప్రపంచకప్‌లో అతి చిన్న వయస్సులోనే సెంచరీ చేసిన నాలుగవ ఆటగాడిగా ఖ్యాతినార్జించాడు. జద్రాన్ 143 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసి భారీ లక్ష్యం విధించడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక 292 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఆఫ్ఘన్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. 40 పరుగులకు 4 వికెట్లు ఆ తరువాత 91 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఇక ఓటమి తధ్యం అనుకున్న పరిస్థితి. ఈ దశలో కూడా పుంజుకోగలదని ఎవరూ ఊహించలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒంటరిపోరు చేశాడు. పాత గాయం తిరగదోడినా, కండరాలు పట్టేసినా, కాల్లు నొప్పి వస్తున్నా జట్టు కోసం అన్నీ భరించాడు. వికెట్ పడకుండా కాపాడుకుంటూ, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆట ఎలా ఆడాలో అందరికీ చూపించాడు. ఒంటరిగానే ఆడాడు. 201 పరుగుల భారీ రికార్డు స్కోరు సాధించి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఓటమి అంచుల వెరకూ వెళ్లిన జట్టును తిరిగి దరిచేర్చాడు. అందుకే ఆస్ట్రేలియా ఆఫ్ఘన్ మ్యాచ్‌లో మేటి హీరో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అయితే మరో హీరో ఇబ్రహీం జద్రాన్.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో కేవలం 128 బంతులు ఆడి 201 పరుగులు చేశాడు. ఇందులో పది సిక్సర్లు కాగా, 21 బౌండరీలున్నాయి. అంటే సిక్సర్లు, బౌండరీలు కలిపితేనే 144 పరుగులు పూర్తయిపోయాయి. స్ట్రైకింగ్ రేట్ 157గా ఉంది. సింగిల్స్ 39 ఉంటే, 2డీలు 9 ఉన్నాయి.
Also read: Glenn Maxwell: గ్లెన్ మ్యాక్స్‌వెల్...యూ ఆర్ రియల్లీ వెల్, ఆటంటే అలా ఆడాలని చూపించావు కదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook