Elephants statue vastu tips and remedies: మనంచేసే ప్రతి పూజలోను తొలుత గణేషుడ్ని పూజించిన తర్వాత మాత్రమే ఏపనైన మొదలు పెడతాం. వినాయకుడ్నిపూజించి ఏ పనిచేసిన అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో వినాయకుడి విగ్రహాంను తెచ్చి మరీ పెట్టుకుంటారు. ముఖ్యంగా బైటకు వెళ్లేటప్పుడు ఆ ఏనుగుల విగ్రహాలను చూస్తు దండంపెట్టుకుని మరీ వెళ్తుంటారు.
ఇలా చేస్తే వెళ్లిన పని సక్సెస్ అవుతుందని చాలా మంది నమ్మకం. మరొవైపు అసలు ఏనుగుల విగ్రహాలన్నింటిలో కూడా శ్వేత గణపయ్య విగ్రహాలను చాలా పవర్ ఫుల్ అని పండితులుచెబుతుంటారు. ఉదయం నిద్రలేవగానే.. తెల్లని ఏనుగుల్ని చూస్తే ఆ రోజు అంత మంచి జరుగుతుందంట. అంతే కాకుండా శ్వేతార్కగణపయ్యను పూజిస్తే ఒక వ్యక్తిలోని నెగెటివ్ ఎనర్జీ, అతని ఇంట్లోని చెడు గుణాలన్ని వెళ్లిపోతాయంట.
అందుకే చాలా మంది తమ ఇళ్లలో ఖచ్చితంగా గణేషుడి విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుంటారు. అంతే కాకుండా.. తెల్లని ఏనుగుల విగ్రహాలు వాస్తు సంబంధ దోషాల్ని సైతం దూరం చేస్తాయంట. ఏ ఇంట్లో అయితే తెల్లని ఏనుగులు ఉంటాయో.. వారి ఇంట్లో ఎప్పటికి ధనంకు లోటు ఉండదంట. ముఖ్యంగా మనం ఇంటికి వినాయకుడి విగ్రహాలు తెచ్చుకునే ముందు అవి తెల్లగా ఉన్నవే తెచ్చుకొవాలి.
ఆతర్వాత ఏనుగు కుడి కాలు ముందర, ఏనుగు తొండం పైకి ఎత్తినట్లు ఉంటే.. మరింత మంచి దని పండితులు చెబుతున్నారు. ఏనుగును ఇంట్లో ఒక ప్లేట్లో పెట్టాలి. అంతే కాకుండా.. దాన్ని ఎప్పటి కప్పువు శుభ్రం చేస్తు, దుమ్ము పడకుండా జాగ్రత్తగా చూసుకొవాలి. తెల్లని ఏనుగు విగ్రహానికి ఎర్రటి కుంకుమ పెట్టాలి. దాన్ని ప్రతిరోజు మనం బైటకు వెళ్లేటప్పడు దండంపెట్టి మరీ వెళ్లాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter