Solar Eclipse 2021 Date And Timings: గత ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఏర్పడ్డాయి. 2021లో మొత్తం 4 గ్రహణాలున్నాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, కాగా మరో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. మే 26న ఈ ఏడాది తొలి గ్రహణమైన చంద్ర గ్రహణం ఏర్పడింది. భారత్‌లో మాత్రం కనిపించలేదు.
జూన్ 10న ఆకాశంలో ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒకే సరళరేఖ మీదుగా వచ్చిన సమయంలో సూర్యుడు, భూమికి మధ్యలో చంద్రుడు రావడంతో సూర్యకాంతి భూమి మీద పడకుండా ఉంటుంది. ఆ స్థితిని సూర్యగ్రహణం అని వ్యవహరిస్తారు. మధ్యాహ్నం 1:42 గంటలకు సూర్యగ్రహణం (Solar Eclipse 2021) ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:41 గంటలకు గ్రహణం వీడనుంది. ఈ సూర్యగ్రహణం కెనడా, గ్రీన్‌లాండ్, రష్యాలోని కొన్ని ప్రాంతాల వారికి కనిపిస్తుంది. టైమ్‌అండ్‌డేట్ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. లేక్ సుపీరియర్ ఉత్తరభాగం, నార్త్ ఒంటారియో వాసులు గ్రహణాన్ని చక్కగా వీక్షించవచ్చు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
రింగ్ ఆఫ్ ఫైర్..
అమెరికాతో పాటు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు. కానీ తూర్పు తీర ప్రాంతంలోని వారికి, పశ్చిమ దిశలో ఎగువ ప్రాంతంలో సెకన్లపాటు సూర్యుడు దర్వనమివ్వనున్నాడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో సూర్యగ్రహణాన్ని (Zodiac Signs Affected With Solar Eclipse) వీక్షించాలని సూచిస్తున్నారు. చంద్రుడు సూర్యుడిని కప్పేసినా, పరిణామంలో చిన్నది కావడంతో సూర్యకాంతి మనకు ఒక వలయం (Ring) ఆకారంలో కనిపిస్తుంది. కనుక దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) అని వ్యవహరిస్తారు. డిసెంబర్ 4న మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook