Shani Dev Influence Zodiac Signs: శని గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని కీడు గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత శని గ్రహం కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది సరిగ్గా మార్చి 29వ తేదీన జరగబోతోంది. అయితే శని కదలిక మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇదే రోజు సరిగ్గా హోలీ పండుగ కూడా రాబోతోంది.
కాబట్టి ఈ హోలీ పండుగ కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా రెండున్నర సంవత్సరాలు పాటు శని మీన రాశిలో ఉంటాడు.. ఈ రెండున్నర సంవత్సరాలు కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో పురోగతి కూడా లభించే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఆర్థికంగా చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ హోలీ పండుగ నుంచి శని శుభ ప్రభావం వల్ల ఏయే రాశుల్లో జన్మించిన వ్యక్తులకు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి శని అదృష్టాన్ని అందించబోతున్నాడు:
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ హోలీ పండుగ నుంచి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే ఆకస్మిక ధన లాభాలతో పాటు అనుకున్న పనుల్లో వెంటవెంటనే చేయగలుగుతారు. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వ్యాపారాల విస్తరణ కోసం ట్రై చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో xసహకరిస్తుంది. ఈ సమయంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు కూడా విస్తరించే ఛాన్స్ ఉంది. ఇక ఈ సమయంలో తండ్రి సపోర్టు లభించి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
మిథున రాశి
శని సంచారం కారణంగా మిథున రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి అనుకున్న పనుల్లో ధన లాభాలు కలగడమే కాకుండా శని ఆశీస్సులు లభించి ఉద్యోగాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి విదేశీ ఒప్పందాలు కూడా చేసుకుంటారు. మీరు అనుకుంటున్న పనుల్లో సులభంగా విజయాలు సాధించడమే కాకుండా భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ఉద్యోగాలు లేనివారికి కూడా ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ లభిస్తాయి.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. హోలీ పండగ నుంచి 2 1/2 సంవత్సరాల పాటు ధనస్సు రాశి వారికి తిరుగు ఉండదు. వీరు ఎలాంటి పనులు చేసిన అనుకూలమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వీరికి భౌతిక ఆనందం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే తల్లిదండ్రులతో సంబంధం మరింత మెరుగుపడి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే జీవితంలో మానసిక ఆనందం పెరగడం వల్ల కొన్ని జబ్బుల నుంచి విముక్తి కూడా పొందుతారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి