Planetary Transit 2024: మరి కొద్దిరోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ జాతకంపై ఆసక్తి కనబరుస్తుంటారు. కొత్త ఏడాది 2024 ఈసారి చాలామందికి అత్యంత శుభప్రదంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. దీనికి జ్యోతిష్యులు చెప్పే కారణం మూడు శక్తివంతమైన గ్రహాల గోచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 2024లో మూడు శక్తివంతమైన గ్రహాలు గోచారం చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అంతులేని లాభాలుంటాయి. అంటే ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వెంటాడనున్నందున కాస్త అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ధన సంపదలు వర్షిస్తాయంటున్నారు. కొత్త ఏడాదిలో ఏయే గ్రహాల గోచారముందో పరిశీలిద్దాం.
సూర్య గోచారం ( Sun Transit 2024)
కొత్త ఏడాదిలో అంటే జనవరి 2024లో సూర్య గోచారం ఉంటుంది. జనవరి 15న మకర రాశిలో సూర్యుడి ప్రవేశం ఉంటుంది. సూర్యుడిని ధన సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఫిబ్రవరి 16 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఫలితంగా దాదాపు నెలరోజులు అన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ధన సంపదలు వచ్చిపడతాయి. ఊహించని లాభాలు ఎదురౌతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్లనే మకర సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
శుక్ర గోచారం (Venus Transit 2024)
కొత్త ఏడాదిలో మరో శక్తివంతమైన గ్రహంగా భావించే శుక్రుడి గోచారముంటుంది. శుక్ర గ్రహం జనవరి 18వ తేదీన ధనస్సు రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 12 వరకూ అదే గ్రహంలో ఉంటాడు. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని అష్ట ఐశ్వర్యాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శుక్రుడి గోచారంపై అన్ని రాశులకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. శుక్రుడు ధనస్సు రాశిలో 25 రోజులుండి ఆ తరువాత మకర రాశిలో చేరుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని రాశులకు అన్ని రకాల సుఖ సంతోషాలు లభిస్తాయంటారు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి.
బుధ గోచారం ( Mercury Transit 2024)
కొత్త ఏడాదిలో అంటే జనవరి 2024 ప్రారంభమౌతూనే గ్రహాల గోచారం మొదలవుతుంది. బుధుడు జనవరి 7వ తేదీన ధనస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. అంతకంటే ముందు జనవరి 2వ తేదీ మార్గం మారనున్నాడు. జవరి 20వ తేదీన పూర్వాషాఢ నక్షత్రంలో 30వ తేదీన ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. అంటే జనవరి నెలలో బుధ గ్రహానికి సంబంధించి ఏకంగా 4 కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫలితంగా అన్ని రాశులపై స్పష్టమైన ప్రభావం పడనుంది. కొన్ని రాశులకు మాత్రం మహర్దశ పట్టనుంది. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పరిగణిస్తారు. అందుకే బుధ గోచారంతో అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయి.
Also read: Christmas: పవిత్రమైన పండుగ క్రిస్మస్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Planetary Transit 2024: కొత్త ఏడాదిలో మూడు గ్రహ గోచారాలు, ఈ జాతకులకు మహర్దశ