Budh Uday 2023 Effect: బుద్ధి, తెలివితేటలకు కారకుడైన బుధుడు ఇవాళ తెల్లవారుజామున 05.15 గంటలకు ధనుస్సు రాశిలో ఉదయించాడు.. ఇది మళ్లీ ఫిబ్రవరి 07 తేదీన మకరరాశిలో సంచరించనుంది. అప్పటికే అదే రాశిలో ఉన్న బుధుడు సూర్యుడుతో సంయోగం చేస్తుంది. ఈ సమయంలో బుధుడు నేరుగా మకరరాశిలో సంచరిస్తాడు. ప్రస్తుతం బృహస్పతి రాశి అయిన ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించడం (Budh Gochar 2023) వల్ల ఈ రాశులవారికి వృత్తి-వ్యాపారంలో అపారమైన పురోగతిని సాధిస్తారు. బుధుడు ఉదయించడం వల్ల ఏ రాశికి చెందిన వారి అదృష్టం పెరుగుతుందో తెలుసుకుందాం.
బుధుడి ఉదయం ఈ రాశులకు శుభప్రదం
మిధునరాశి (Gemini): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ధనుస్సు రాశిలో బుధుడు ఉదయించడం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో కొత్త భాగస్వామిని పొందవచ్చు. ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి (Leo): బుధుడు ఉదయించడం వల్ల ఈ రాశి వారికి ఉపశమనం కలుగుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా మీ ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా విదేశీ కంపెనీల్లో మీరు ఉద్యోగం పొందుతారు. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టడం మీరు లాభాలను పొందుతారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
తులారాశి (Libra): మెర్క్యూరీ సంచారం తులరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. నిరుద్యోగులు ఉపాధి పొందుతారు. మీరు ఏదైనా ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చికరాశి (Scorpio): బుధుడు ఉదయించడం వల్ల ఈ రాశుల వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాలలో విజయం దక్కుతుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. బిజినెస్ చేసే వారు భారీ లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి