Lunar Eclipse in October 2023: చంద్రుడు, సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజునే సంభవిస్తుంది. చంద్రగ్రహణం ఏర్పడే దృశ్యాలు ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చంద్రుడు భూమికి సమీపంలోకి వెళ్లినప్పుడు ఈ దృశ్యలు ఏర్పడతాయని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం సూతకాలం అక్టోబర్ 28న జరుగబోతోంది. అక్టోబర్ 28న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చంద్రగ్రహణం కారణంగా ఏయే పండగలపై ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భారత కాలమాన ప్రకారం..రాత్రి 1 గంట ప్రాంతంలో గ్రహణం ఏర్పడబోతోంది. ఇదే రోజు శరత్ పూర్ణిమ కూడా రాబోతోంది. శరత్ పూర్ణిమ అర్ధరాత్రి చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక సమయం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో దేవత మూర్తులకు ఖీర్ ప్రసాదంగా సమర్పించడం వల్ల కోరకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు చంద్రుడికి కూడా కీర్ సమర్పిస్తారు. సూతకం అక్టోబర్ 28 సాయంత్రం 4:05 నుంచి ప్రారంభం కాబోతోంది..కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ చంద్రగ్రహణం ఆసియా, రష్యా, ఆఫ్రికా, అమెరికా, యూరప్, అంటార్కిటికాతో పాటు చంద్రుడు హోరిజోన్‌కు ఎగువన ఉన్న ప్రాంతాల వారికి కూడా ఈ గ్రహణం కనిపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గరిష్ట గ్రహణం సమయంలో చంద్రుడు హోరిజోన్ నుండి 62° ఎత్తులో ఉంటాడు. ఈ గ్రహణం మధ్యాహ్నం 1:45 గంటలకు సంభవిస్తుంది.
చంద్రగ్రహణం తేదీ : 28 అక్టోబర్ 2023
చంద్రగ్రహణం ప్రారంభ సమయం: ఉదయం 11:31 అక్టోబర్ 28
చంద్రగ్రహణం ముగింపు సమయం: ఉదయం 3:36 అక్టోబర్ 29
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి