Planet Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కదలికలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జూన్ 17న శని కుంభరాశిలో తిరోగమనం చేశాడు. రాహు మేషంలో మరియు కేతువు తులరాశిలో తిరోగమనం చేయబోతున్నాయి. ఈ మూడు గ్రహాలు రాబోయే 6 నెలల పాటు ఇదే స్థితిలో ఉండబోతున్నాయి. సాధారణంగా గ్రహాల వ్యతిరేక కదలిక చెడు ఫలితాలనే ఇస్తుంది. ఈ మూడు గ్రహాలు రివర్స్ కదలిక ఏయే రాశులవారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
మూడు పెద్ద గ్రహాలు తిరోగమన స్థితిలో రావడం కర్కాటక రాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. వీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి ఖర్చు పెట్టండి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోండి.
సింహరాశి
రాబోయే 6 నెలలు సింహరాశి వారికి ఈ సమయం బాధాకరంగా ఉండనుంది. కొత్త ఉద్యోగం రావడానికి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. గ్రహాల వ్యతిరేక కదలిక వల్ల మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు పనిచేయాలని అనిపించదు.
Also Read: Jupiter transit 2023: విపరీత రాజయోగంతో మారనున్న ఈ రాశుల ఫేట్.. ఇందులో మీరాశి ఉందా?
వృశ్చిక రాశి
శని, రాహువు మరియు కేతువుల తిరోగమన స్థితి వృశ్చికరాశి వారు కష్టాలను పెంచుతుంది. మీ వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి రావచ్చు. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం అస్సలు కలిసి రాదు.
Also Read: Surya Gochar 2023: సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం... మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి