Surya Grahan 2023: ఏర్పడబోయేది కంకణ కృతి సూర్యగ్రహణం, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే, లేకపోతే అంతే సంగతి!

First Surya Grahan 2023: ఏర్పడబోయే సూర్యగ్రహణం కారణంగా చాలా చెడు ప్రభావం మనుషులపై పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 04:31 PM IST
Surya Grahan 2023: ఏర్పడబోయేది కంకణ కృతి సూర్యగ్రహణం, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే, లేకపోతే అంతే సంగతి!

First Solar Eclipse 2023: ఈ నెల రెండవ వారం అంటే ఏప్రిల్‌ 20 బుధవారం ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం ఉదయం 07:04 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. మొత్తానికి ఈ గ్రహణం  ఐదున్నర గంటల పాటు ఉండబోతోంది. ఇక భారత్‌లో సూర్య గ్రహం విషయానికొస్తే.. ఈ గ్రహణం మన దేశంపై ఎలాంటి ప్రభావవం చూపకపోయిన తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి సూతక కాలం లేకపోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోందో తెలుసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి గ్రహణం ప్రభావం ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో సూర్యగ్రహణం(Surya Grahan):

ఈ మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణం కారణంగా ఏర్పడే సూతక కాలం చెల్లదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణం కంబోడియా, చైనా, అమెరికా, సింగపూర్, థాయిలాండ్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ హిందూ మహాసముద్రంతో పాటు న్యూజిలాండ్‌ దేశాల్లో కనిపించబోతోందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏర్పడబోయే సూర్యగ్రహణాన్ని కంకణకృతి సూర్యగ్రహణంగా కూడా పిలువచ్చు.

Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

సూర్యగ్రహణం క్రమంలో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు (Solar Eclipse):

సూర్యగ్రహణాన్ని చూడాలనుకునేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు డైరెక్ట్‌ కళ్లతో చూడడం చాలా హానికరం. కాబట్టి ఇది చూసే క్రమంలో సన్ గ్లాసెస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల వల్ల కళ్లు దెబ్బతినే ఛాన్స్‌ ఉంది.

గ్రహణ సమయంలో ఇష్టదైవానికి నామస్మరణ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా భగవంతునికి యజ్ఞం, పూజలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావం దూరమవుతుంది.

Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Solar Eclipse 2023

Trending News