Budh Margi In Sagittarius 2023: జనవరి 13 నుండి ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి దశ తిరగడం ఖాయం

Budh Margi 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం జనవరి 13, 2023న ధనుస్సు రాశిలో సంచరించబోతోంది. మెర్క్యురీ గ్రహం యొక్క సంచారం 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 05:26 PM IST
  • 2023 ప్రారంభంలో బుధుడి సంచారం
  • బుద్ధి, కమ్యూనికేషన్ కు బుధుడు కారకుడు
  • ఈ 3 రాశులవారికి ప్రయోజనకరం
Budh Margi In Sagittarius 2023: జనవరి 13 నుండి ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి దశ తిరగడం ఖాయం

Budh Margi In Sagittarius 2023: వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 13, 2023 నాడు బుధుడు ధనుస్సు రాశిలో నేరుగా నడవనున్నాడు. సంభాషణ, ప్రసంగం, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కారకుడు బుధుడు. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. బుధుడి ప్రత్యక్ష సంచారం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చికం (Scorpio): బుధుడి ప్రత్యక్ష సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి రెండవ ఇంటికి మారబోతోంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ కు సంబంధించి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 

మీనం (Pisces): బుధుడు మార్గం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి పదో స్థానంలో సంచరించబోతోంది. దీంతో మీరు వ్యాపారంలో  మంచి లాభాలను సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీ కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు మీ సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది.

కుంభం (Aquarius): బుధ గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి 11 వ ఇంట్లో మార్పు చెందుతుంది. దీన్నే ఆదాయం మరియు లాభాల స్థానం అంటారు. అయితే మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. కెరీర్ లో మీరు పురోగతి సాధిస్తారు. స్టాక్ మార్కెట్‌లో మంచి లాభాలు గడిస్తున్నారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.

Also Read: Astrology: ధనుస్సు రాశిలో సూర్య, శుక్రుల కలయిక... ఈ 4 రాశులకు అదృష్ట యోగం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News