Bengaluru Women: మా అత్తను చంపాలి.. ప్లీజ్ ఏ మందు పెట్టాలో చెప్తారా..?.. డాక్టర్‌కు వాట్సాప్ మెస్సెజ్.. ఆ తర్వాత..?

Bengaluru angry women: బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఏకంగా  ఒక డాక్టర్ కు వాట్సాప్ లో మెస్సెజ్ చేసి తన అత్తను ఏవిధంగా చంపాలో అడిగింది. దీంతో ఆయన ఖంగుతిన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 19, 2025, 06:04 PM IST
  • అత్తను చంపేందుకు కోడలి స్కెచ్..
  • ఏకంగా డాక్టర్ కు మెస్సెజ్..
Bengaluru Women: మా అత్తను చంపాలి.. ప్లీజ్ ఏ మందు పెట్టాలో చెప్తారా..?.. డాక్టర్‌కు వాట్సాప్ మెస్సెజ్.. ఆ తర్వాత..?

Bengaluru women message to doctor: సాధారణంగా సమాజంలో అత్తా కోడళ్ల మధ్య ఉండే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ప్రతి ఒక్క ఇంటిలో ఉండేదే. అయితే.. కొన్ని చోట్ల అత్తా కోడల్ని డామినేట్ చేస్తే, మరికొన్ని చోట్ల కోడలు అత్తను డామినేట్ చేస్తుంటుంది. చాలా చోట్ల అత్తా కోడళ్లు మాత్రం టామ్ అండ్ జెర్రీలో గొడవలు పడుతుంటారు. కానీ మరికొన్ని చోట్ల దీనికి భిన్నంగాకూడా ఉంటారు.

సొంత తల్లి కూతుళ్లు కూడా  ఉండనంత ప్రేమగా, ఆప్యాయతతో అత్తా కోడళ్ల మధ్య బాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇటీవల కాలంలో అత్తా కోడళ్ల మధ్య గొడవలు పీక్స్ కు వెళ్తున్నాయి. కొన్ని చోట్ల అత్తా కోడల్ని హత్యలు చేసేందుకు ప్లాన్ లు వేస్తుంటే.. మరికొన్ని చోట్ల కోడలు అత్తను పైకి పంపేందుకు స్కెచ్ పెడుతుంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఇటీవల బెంగళూరులో ఉండే.. డాక్టర్ సునీల్ అనే డాక్టర్ కు .. సహానా..అనే మహిళ ఇన్ స్టాలో పరిచయం అయ్యింది. ఆమె ఇటీవల డాక్టర్ కు మెస్సెజ్ లు పెట్టింది. ఏదో అడగటానికి తొలుత భయపడింది. ఏమనుకొవద్దని డాక్టర్ కు వాట్సాప్ మెస్సెజ్ చేసి.. తన అత్త రోజు టార్చర్ చేస్తుందని దయచేసి.. ఆమెను లేకుండా చేసేందుకు ఏదైన ట్యాబ్లెట్ లు చెప్పాలని ఆమె కోరింది. దీనికి సదరు వైద్యుడు.. ఇలాంటి పనులు తాను చేయనని సీరియస్ అయ్యాడు.

Read more: Swara Bhasker: ఛావా సినిమాపై నటి షాకింగ్ కామెంట్స్ .. భగ్గుమన్న హిందు సంఘాలు.. మ్యాటర్ ఏంటంటే..?

వెంటనే మహిళ మెస్సెల్ డిలీట్ చేసింది. డాక్టర్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసేసింది. అయితే.. అప్పటికే సదరు డాక్టర్ ఆమహిలతో చేసిన కన్వర్సేషన్ ను స్క్రిన్ షాట్ తీసుకుని పెట్టుకున్నాడు. దీనిపైన అనుమానం కల్గడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంత మంది కావాలని తనను మహిళ పేరుతో ఎవరో.. ఇలా ఇరికించాలని చూసినట్లు అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News