Viral news in Telugu: ఇంట్లో ఎలుకలు ఉంటే వాటితో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అవి చిరాకు తెప్పించడమే కాకుండా తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తాయి. ధాన్యాన్ని నాశనం చేయడం, వస్తువులను కొరికేయడం వంటివి చేస్తుంటాయి. ఇవి ఉండటం వల్ల వివిధ రకాల రోగాలకు గురవుతాం. ఇంట్లో ఎలుకలు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు. మనకు మనశ్శాంతి కొరవడుతుంది. దీంతో వీటిని ఎలాగైనా తరమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇప్పుడు ఈ ఎలుకల బెడద న్యూయార్క్ నగరాన్ని పట్టిపీడిస్తుంది. ఈ ర్యాట్స్ కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటుున్నారు.
ఎలుకల పెట్టే టార్చర్ భరించలేక న్యూయర్క్ నగర్ మేయర్ వినూత్న ఆలోచన చేశారు. ఏకంగా వాటిని పట్టుకునేందుకు ర్యాట్ క్యాచర్స్ ను నియమించారు. వీరి వేతనం ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అక్షరాల వీరి జీతం కోటి 20 లక్షలు. ఈ మేరకు ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరుతో ఎలుకలను పట్టుకునే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు మేయర్. ఇప్పటి వరకు ఈ జాబ్ కు 900 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో నుంచి కొరాడీ అనే స్కూల్ టీచర్ ను ఎంపిక చేశారు. ఈమె విద్యాశాఖలో ఎలుకల నియంత్రణకు సంబంధించి పరిశోధన చేశారు.
ఈమె యెుక్క విధులు ఏంటంటే.. ఇళ్లలో మిగిలిపోయిన పుడ్, చెత్తను ఎలకలకు దొరకుండా డిస్పోస్ చేయడం, సబ్‌వేలలో ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చూడటం, ర్యాట్స్ సంతతి తగ్గేలా చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ర్యాట్స్ నిర్మూలనలో పలు అంక్షలు విధించారు అధికారులు. వీటిని ఎలాంటి విషపదార్థాలు పెట్టి చంపకూడదు, ఎందుకంటే వీటిని తిన్న మిగతా జీవులు చనిపోయే ప్రమాదం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Wedding with Robo: లేడీ రోబోతో యువకుడి ప్రేమాయణం.. మూఢాల్లోనే పెళ్లి.. ఎక్కడో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter