Sreemukhi Dispute: ఇప్పటికే ఓ సినిమా వేడుకలో వివాదాస్పద వ్యాఖ్యల దుమారం మరచిపోకముందే సినీ నటి, యాంకర్ శ్రీముఖి మరో వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అతి ప్రముఖ ఆలయమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీముఖి వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆలయ ఆవరణలో.. గోపురం ఎదుటగా ఫోటోలు, ఫొటోషూట్స్, రీల్స్‌తో శ్రీముఖి హల్చల్ చేశారు. ఆలయ ఆవరణలో భక్తితో ఉండాల్సి ఉండగా రీల్స్, ఫొటోషూట్ చేయడం వివాదాస్పదంగా మారింది.
Also Read: Daaku Maharaaj Movie: డాకు మహారాజ్‌కు థియేటర్లో ఎదురుదెబ్బ.. థమన్పై ఫ్యాన్స్ ఫైర్
విజయవాడ నగరంలో యాంకర్, సినీనటి శ్రీముఖి, జబర్దస్త్ నటుడు ముక్కు అవినాశ్, ఆర్జే చైతూ సందడి చేశారు. ఓ షోలో పాల్గొనేందుకు వచ్చిన వారు బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నకనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదాశీర్వచనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొందరు భక్తులతో శ్రీముఖి ఫొటోలు దిగారు. అనంతరం శ్రీముఖి,ముక్కు అవినాశ్, ఆర్జే చైతూ మీడియాతో మాట్లాడారు. కనకదుర్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చిన అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు.
అయితే తన సోషల్ మీడియాలో అమ్మవారి ఆలయం వద్ద చేసిన రీల్ శ్రీముఖి పంచుకుంది. 'కనకదుర్గమ్మ తల్లి దర్శనం' అంటూ పోస్టు చేసిన ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆలయ రాజగోపురం వద్ద శ్రీముఖి రీల్స్ చేశారు. అక్కడే ఫొటోలు దిగారు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టును చూసి నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తున్నారు. ఈ అంశంలో శ్రీముఖి ఇప్పటికే క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయ ఆవరణలో భక్తితో ఉండాల్సి ఉండగా ఇలా రీల్స్, ఫొటోలు తీయడం తగదని నెటిజన్లు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.