Oyo Dispute: మళ్లీ వివాదంలో ఓయో, బూమరాంగ్ అవుతున్న సంస్థ ప్రకటన, అసలేం జరిగింది

Oyo Dispute: ప్రముఖ ఆన్‌లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సంస్థ ఓయో మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ పత్రికకు ఇచ్చిన వాణిజ్య ప్రకటన వివాదాస్పదమై బాయ్‌కాట్ ఓయో ట్రెండింగ్‌కు కారణమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2025, 09:26 AM IST
Oyo Dispute: మళ్లీ వివాదంలో ఓయో, బూమరాంగ్ అవుతున్న సంస్థ ప్రకటన, అసలేం జరిగింది

Oyo Dispute: ఈ మధ్యకాలంలో ఓయో వార్తల్లో ఉంటోంది. పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వమనే ప్రకటనతో సంచలనం రేపిన ఓయో ఇప్పుడు అనుకోకుండా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఏదో చేద్దామనే ప్రయత్నంలో వివాదంలో పడిపోయింది. ఇప్పుడు మళ్లీ నెటిజన్లు బాయ్‌కాట్ ఓయో అంటున్నారు. 

వాణిజ్య ప్రకటనలు ఏ సంస్థకైనా చాలా అవసరం. ఈ ప్రకటనలు చాలా బ్యాలెన్స్‌గా ఉండాలి. క్రియేటివ్‌గా ఉండాలి. కానీ వేరే అర్ధాలు వచ్చేలా ఉండకూడదు. లేకపోతే ఇలానే బూమరాంగ్ అవుతుంది. ఏదో సందేశం ఇద్దామనుకుని బోర్లా పడింది. పర్యవసానం సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఓయో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలేం జరిగిందంటే..ఓయో ఇటీవల ఓ ప్రముఖ హిందీ పత్రికకు ఓ వాణిజ్య ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనే మొత్తం వివాదానికి కారణమైంది. ఈ ప్రకటనలో ..." భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు...ఓయో కూడా"అని ఉంది. అంతే నెటిజన్లు ఈ ప్రకటనను మరో కోణంలో అర్ధం చేసుకున్నారు. నిన్ను నీవు దేవుడితే పోల్చుకుంటావా అంటూ మండిపడుతున్నారు. బాయ్‌కాట్ ఓయో అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

వాస్తవానికి ఓయో ప్రకటన అర్ధం ఏంటంటే భగవంతుడు ఏ విధంగా అన్ని చోట్లా ఉన్నాడో అదే విదంగా ఓయో హోటల్ రూమ్స్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయని అర్ధం. కానీ నెటిజన్లు దీనిని మరో కోణంలో అర్ధం చేసుకుని బాయ్‌కాట్ ఓయోకు పిలుపిచ్చారు. హిందూవుల మనోభావాల్ని దెబ్బతీసిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఓయో ట్రెండింగులో ఉండటంతో ఓయో సంస్థ వివరణ ఇచ్చుకుంది. తమ ఉద్దేశ్యం అది కాదని. టెంపుల్ టూరిజంను ప్రోత్సహించే ఉద్దేశంతో అలా ప్రకటన ఇచ్చామని వివరించింది. భక్తుల మత విశ్వాసాలను భంగం కల్గించడం తమ ఉద్దేశ్యం కాదని తెలిపింది.

Also read: Airtel: ఎయిర్‌టెల్‌ రూ. 2249 VS రూ.1849 ప్లాన్‌.. ఈ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్‌ తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News