Funny Jokes Video: సోషల్ మీడియాలో తరచుగా వింత విన్యాసాలు, ఫాన్నీ వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఇటీవలే ఓ ఫాన్నీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని చూసినవారంతా పడిపడి నవ్వుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో? నెటిజన్స్ దీనిని అసక్తి చూడడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వ్యక్తి సూపర్‌గ్లూతో చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సోషల్ మీడియా క్రేజ్ సంపాదించుకోవడానికి ఏకంగా చేయకూడని సాహసం చేశారు. ఇది కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన నోరును గట్టిగా మూసుకుని పేదాలకు సూపర్‌గ్లూ పెట్టుకుంటారు. అయితే ఆ సూపర్‌గ్లూ నోటికి, పెదాలకు పూర్తిగా అతుక్కుంటుంది. ఇంతలోనే పక్కన ఉన్న వ్యక్తి హస్యం చేస్తాడు.. నవ్వే క్రమంలో సూపర్‌గ్లూ పూసుకున్న వ్యక్తికి అది పూసిన చోట చాలా నొప్పిగా ఉంటుంది.
ఆ వ్యక్తి నోరు పూర్తిగా సూపర్‌గ్లూతో మూసుకు పోతుంది. అతను ఎంత తెరవాలని ప్రయత్నించిన ఏ మాత్రం రాదు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నోరు పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఆ వ్యక్తి ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారట.. అయితే ఈ వీడియోను తన తోటి స్నేహితులు ఫన్నీ వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు పడి పడి నవ్వుతున్నారు.
ఈ వైరల్ అవుతున్న వీడియోను @Badis_TV అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా నెటిజన్స్ వీక్షించినట్లు సమాచారం. అలాగే దీనిని 12 లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. దీనికి 27 వేల మంది కామెంట్స్ కూడా పెట్టారు. అయితే ఇందులో చాలా వరకు ఫాన్నీ కామెంట్స్ ఉన్నాయి. ఏది ఏమైన ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఏది పడితే అది చేయడం పెద్ద తప్పని కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook