Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

Fan Misbehave: సినీనటీ కాజల్ అగర్వాల్ ఒక వేడుకకు హజరవ్వడానికి వచ్చారు. అక్కడ ఆమెను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అక్కడ కొద్దిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన ఒక అభిమాని ఆమె దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 6, 2024, 04:09 PM IST
  • ప్రైవేటు ప్రొగ్రామ్ లో కాజల్ అగర్వాల్ కు చేదు అనుభం..
  • పబ్లిక్ గా అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని..
Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

Fan Misbehave With Bollywood Actress Kajal Aggarwal: కొన్నిసార్లు ఫ్యాన్స్ అతిగా ప్రవర్తిస్తుంటారు. సినిమా ఇనాగ్రేషన్స్ లు, షాపింగ్ మాల్స్ ల ఓపెనింగ్ లకు పెద్ద పెద్ద లేడీ స్టార్ లను ఆహ్వానిస్తుంటారు. తమ అభిమాన హీరోయిన్లను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు వస్తుంటారు.  ఈ క్రమంలో ముందుగానే నిర్వాహాకులు ముందుగానే అన్నిరకాల చర్యలు తీసుకుంటారు. కానీ కొన్నిచోట్ల అభిమానులు అతిగా ప్రవర్తిస్తుంటారు. తమ అభిమానుల నటులతో ఫోటోలు దిగడానికి ప్రయత్నిస్తుంటారు. దీనిలో భాగంగా.. కొందరు అభిమానులకు దగ్గరగా వెళ్తుంటారు. అంతటితో ఆగకుండా.. వారిని తాకుతూ కొందరు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తారు.

 

అంతటితో ఆగకుండా నడుము మీద, ప్రైవేటు పార్ట్ లను కావాలని తాకే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనల వల్ల మహిళలు ఎంతో అసౌర్యానికి గురౌతుంటారు. గతంలో కూడా ఎందరు సినీ తారలు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్నారు. తాజాగా, సినీనటి కాజల్ అగర్వాల్ కు ఇలాంటి ఘటన ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

స్టార్ హీరోయిన్  కాజల్ అగర్వాల్ ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీలు దిగడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ ఉన్న బౌన్సర్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు ఆమె దగ్గరకు చొచ్చుకుని వచ్చాడు. ఏకంగా కాజల్ అగర్వాల్ దగ్గరకు వెళ్లి, సెకన్ల వ్యవధిలో ఆమె నడుముపై చేయిపెట్టాడు. వెంటనే ఆమె షాకింగ్ కు గురైంది.

Read More: Healthy Drinks: పొట్టను శుభ్రం చేసే 3 డ్రింక్స్.. కేవలం 10 రోజుల్లో బరువు కూడా తగ్గొచ్చు..!

వెంటనే తెరుకునే లోపే అతగాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటనతో కాజల్ అగర్వాల్ ఎంతో అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం పాడుపని అంటూ కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ ల పట్ల ఇలా ప్రవర్తించకూడదని, వెంటనే అతడిని గుర్తించి కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా మండిపడుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News