7th Pay Commission Updates: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ తొలి గిఫ్ట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!

7th Pay Commission DA Arrear News: కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా మరోసారి పెండింగ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది. 
 

1 /9

బడ్జెట్ 2025‌లో పెండింగ్‌లో 18 నెలల డీఏ, డీఆర్‌కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.   

2 /9

కరోనా సమయంలో యావత్ దేశం సంక్షోభం ఎదుర్కొన్న సమయంలో ఉద్యోగుల డీఏ అమౌంట్‌ను సంక్షేమ పథకాలు, పేద ప్రజల సహాయార్థం ఉపయోగించారు.  

3 /9

కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకున్న తరువాత పెండింగ్ డీఏలను కేంద్రం విడుదల చేస్తుందని ఉద్యోగులు పెట్టుకున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

4 /9

జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డీఏలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల సంఘాలు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి.  

5 /9

పెండింగ్ డీఏలు చెల్లించాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారు. కరోనా సమయంలో నిలిపివేసిన డీఏలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు పడతున్నారని అన్నారు.  

6 /9

ప్రస్తుతం దేశం ఆర్థికంగా పురోగమిస్తోందని.. పెండింగ్ డీఏ, డీఆర్ చెల్లించాలని కోరారు.  

7 /9

పెండింగ్‌ డీఏలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే రూ.2 లక్షల వరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని అంటున్నారు.   

8 /9

మూడు విడతలుగా చెల్లించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.   

9 /9

వచ్చే ఏడాది డీఏ పెంపు, కొత్త పే కమిషన్ ఏర్పాటు, పెండింగ్ డీఏల ప్రకటనల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.