Father In Law And Bride Shocked: మారుతున్న కాలానికి ఇప్పుడు వివాహ వ్యవస్థలో కూడా భారీ మార్పులు వస్తున్నాయి. గతంలో అబ్బాయిలు అమ్మాయిలను రిజెక్ట్ చేసేవాళ్లు. అమ్మాయిని ఏరికోరి ఎంచుకునే అబ్బాయిల పరిస్థితి రివర్స్ అయ్యింది. ఇప్పుడు అమ్మాయిలు రిజక్ట్ చేసేస్తున్నారు. పెళ్లిపై అమ్మాయిలు స్వతంత్ర నిర్ణయాలతోపాటు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో కట్నం అనే ప్రస్తావన రోజురోజుకు తగ్గిపోతుంది. ఇలాగే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కట్నం తీసుకున్న ఓ వరుడు మాత్రం చేసిన పనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వరకట్నంగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి తన మామకు ఇచ్చేశాడు. ఒక కొబ్బరికాయ.. ఒక రూపాయి మాత్రమే కట్నంగా తీసుకున్నాడు. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Double Bonus: ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. లాభాలను 'డబుల్ బోనస్'గా పంచేసిన కంపెనీ
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాకు చెందిన పరంవీర్ రాథోర్ సివిల్స్ పరీక్షలు రాస్తున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి కుటుంబసభ్యులు వివాహం చేశారు. ఫిబ్రవరి 14వ తేదీన కరాలియాకు చెందిన నిఖిత బాటిను వివాహం చేసుకున్నాడు. అయితే వరకట్నంగా అతడి మామ కొన్ని కానుకలతోపాటు ఎర్రటి వస్త్రంలో అలంకరించిన ప్రత్యేక పాత్రలో రూ.5,51,000 వరకట్నం ఇచ్చాడు. ఇది చూసిన అల్లుడు పరంవీర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
కట్నం తిరిగి ఇస్తూ దానికి గల కారణాన్ని పరంవీర్ వెల్లడించాడు. 'పెళ్లిలో ఇంకా వరకట్నం వంటి దురాచారాలు కొనసాగుతుండడం చూసి నాకు బాధ వేసింది. అందుకే పెళ్లి తర్వాత మా నాన్న, కుటుంబసభ్యులతో మాట్లాడి ఆ డబ్బును తిరిగి ఇచ్చా' అని పరంవీర్ తెలిపాడు. 'నేను సివిల్స్ పరీక్షలు రాస్తున్నా. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది. చదువుకున్నవాళ్లం మేం మార్పు తీసుకురాకపోతే మరెవరు ముందుకు వస్తారు' అని ప్రశ్నించాడు. అందుకే తన నుంచే ఆ మార్పును ప్రారంభించినట్లు పరంవీర్ చెప్పాడు. వరకట్నం తిరిగి ఇచ్చే అంశాన్ని తల్లిదండ్రులు, కుటుంబీకులకు చెబితే వాళ్లు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు.
వరకట్నం తిరిగివ్వడంతో పరంవీర్ తండ్రి ఈశ్వర్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. 'నేను ఒక రైతు. సంప్రదాయం, ఆచారం ప్రకారం వరకట్నంగా కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే తీసుకున్నా. నా కొడుకు వరకట్న వ్యవస్థను మార్పు చేయాలని చేసిన నిర్ణయం సంతోషం' అని పరంవీర్ తండ్రి ఈశ్వర్ సింగ్ తెలిపాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.