Bengal Couple agreement goes viral: ఇటీవల కాలంలో చాలా మంది యువత వెరైటీగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది యువత అసలు పెళ్లి చేసుకునేందుకు అస్సలు ఆసక్తి చూపించడంలేదు. మరికొందరు పెళ్లి అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. ఇంకా కొందరు పెళ్లి చేసుకొవాలంటే రకరకాల కండీషన్లు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రతిదానికి అనుమానం పడుతు తమ జీవిత భాగస్వామి పట్ల షాడిజం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వెరైటీ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
ఇటీవల చాలా మంది యువత ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు. అంతే కాకుండా.. తమ వాళ్లతో సరదాగా గడిపి మంచి గిఫ్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేసుకున్నారు. అయితే.. పెళ్లికానీ వారు మాత్రమే కాకుండా.. కొంత మంది పెళ్లైన జంటలు కూడా వాలెంటైన్స్ డేను ఎంతో గ్రాండ్గా జరుపుకున్నారు. అయితే.. ప్రస్తుతం బెంగాల్ కు చెందిన అనయ ఆమె భర్త శుభమ్ లు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ దంపతులకు రెండేళ్ల క్రితమే పెళ్లైంది. అయితే.. వీరిద్దరు ఇటీవల ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున ఒక అగ్రిమెంట్ మీద ఇద్దరు పాటించాల్నిన కొన్ని కండీషన్ లు రాసుకున్నారు. దీనిలో ముఖ్యంగా.. ఎవనైతే ఈ కండీషన్ లను అతిక్రమిస్తే వారు ఏడాది పాటు ఇంటి పనులు చేయాలని, బాత్రూమ్ లను కడగాలని అగ్రిమెంట్ లను మరీ రాసుకున్నారు. మొత్తంగా వీరిద్దరు కలిసి ఐదువందలు బాండ్ మీద రాసుకున్న కండీషన్ లను చూసి ఆశ్చర్యపోతున్నారు.
వెస్ట్ బెంగాల్ కు జంట రూ. 500 బాండ్ మీద రాసుకున్న ముఖ్యమైన అగ్రిమెంట్ పాయింట్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో అనయ శుభమ్ లు రాసుకున్న అగ్రిమెంట్ పాయింట్ లు ఇవే..
1, ఇంట్లోకి రాగానే భార్యభర్తలు తినేందుకు కూర్చున్నప్పుడు కుటుంబ సంబంధ విషయాలు మాత్రమే డిస్కస్ చేయాలి.
2,భార్యభర్తలు కలిసి ఉన్నప్పుడు ఆఫీసుల గురించి, ఇతర సమస్యల గురించి మాట్లడకూడదు.
3,అదే విధంగా తనను బ్యూటీ కాయిన్, క్రిప్టో అని పిలవద్దని కండీషన్ పెట్టింది.
4,రాత్రి పడుకునేటప్పుడు..ఫోన్ లలో యాప్ లు, వీడియోలు చూడకూడదు.
1,మరోవైపు భర్త కూడా భార్యకు దిమ్మతిరిగే విధంగా కండీషన్స్ పెట్టాడు.
2,తన గురించి అదేపనిగా తల్లికి కంప్లైట్ ఇవ్వడం మానేయాలి.
3,తన మాజీ ఎఫైర్ గురించి అదే పనిగా పొడిచినట్లు మాట్లాడకూడదు..
4,అవసరం లేకున్న కాస్లీ దుస్తులు కొనడం మానేయాలి.
5,ఫుడ్ డెలీవరీ స్విగ్గీ, జొమాలలో రాత్రి పూట ఆర్డర్ పెట్టకూడదు.
మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ రూల్స్ లను.. ఎవరు అతిక్రమించిన కూడా.. మూడు నెలల పాటు బట్టలు ఉతకాడంపాటు, టాయ్ లెట్లను కూడా శుభ్రం చేయాలి. అంతేకాకుండా.. ఇంటికి కావాల్సిన సామానులుకూడా తీసుకుని రావాలి. ఈ దంపతుల కండీషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు..ఇదేక్కడి కండీషన్ రా బాబు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter