Barefoot Walk: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా యోగా, వాకింగ్ అనేవి అలవర్చుకోవాలి.
అదే సమయంలో రోజూ ఉదయం గడ్డిపై చెప్పుల్లేకుండా నడవడం చాలా మంచి అలవాటు. దీనివల్ల మీరు కలలో కూడా ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది ఓ రకమైన నేచురల్ థెరపీ. రోజూ ఇలా నడిస్తే 5 అద్భుతమైన లాభాలు ఉంటాయి
నిద్రలేమికి చెక్ రోజూ రాత్రి కొందరికి నిద్ర పట్టదు. నిద్ర లేమి సమస్యతో బాధపడేవాళ్లు రోజూ ఉదయం పచ్చగడ్డిపై నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రోజూ కనీసం 15-20 నిమిషాలు నడవాలి. దీనివల్ల శరీరంలో మెలానిన్ హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.
రక్త ప్రసరణ గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా గుండె వ్యాధులు దూరమౌతాయి. కాలి పాదాలపై ఒత్తిడి పడటంతో రక్త నాళాలకు ఉపశమనం కలుగుతుది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు ఉంటే నియంత్రణలో వస్తుంది
ఇమ్యూనిటీ పటిష్టం పచ్చగడ్డిలో సహజసిద్ధమైన హీలింగ్ పవర్ ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది మనిషి ఇమ్యూనిటీని పెంచుతుంది. బేర్ఫుట్ నడవడం వల్ల శరీరం బ్యాలెన్స్ అవుతుంది. ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది.
ఒత్తిడి, ఆందోళన దూరం ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడితో బిజీగా ఉంటున్నారు. దాంతో ఒత్తిడి, ఆందోళన సాధారణంగా మారిపోయాయి. రోజూ గడ్డిపై నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మూడ్ బాగుంటుంది. తాజా గాలి, పచ్చదనం మధ్య వాక్ చేయడం వల్ల డోపమైన్, సెరిటోనిన్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి.
కంటి చూపు మెరుగుదల రోజూ గంటల తరబడి ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ముందు కూర్చుని పనిచేసేవారికి కంటి చూపు మందగిస్తుంది. ఇలాంటి వ్యక్తులు రోజూ గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేయాలి. ఆయుర్వేదంలో పాదాల అడుగున ఉండే కొన్ని పాయింట్స్ కంటితో కనెక్షన్ కలిగి ఉంటాయి. గడ్డిపై బేర్ఫుట్ నడవడం వల్ల ఆ పాయింట్స్ యాక్టివ్ అవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.