KCR Sister Dead: కేసీఆర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం.. కేటీఆర్‌ దిగ్భ్రాంతి

Ex CM KCR Sister Sakalamma Passes Away: కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోదరిమణి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు.

1 /7

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేటీఆర్‌ సోదరిమణి తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.

2 /7

కేసీఆర్ ఐదో సోదరి చీటీ సకలమ్మ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు దాదాపు 90 వరకు ఉంటుందని సమాచారం.

3 /7

తన అక్క సకలమ్మతో ఆత్మీయ అనుబంధం కలిగిన కేసీఆర్‌ ఆమె మరణంతో దిగ్భ్రాంతికి లోనయినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ తన అక్కలతో ఎంతో ప్రేమానురాగాలతో ఉంటున్నారు.

4 /7

కేసీఆర్‌ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉంది. వీరిలో కొందరు కాలం చెందారు.

5 /7

2018 ఫిబ్రవరి 21వ తేదీన కేసీఆర్‌ రెండో అక్క విమల బాయి (82), మరో సోదరి లీలమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు.

6 /7

ప్రతి రాఖీ పండుగకు తప్పనిసరిగా కేసీఆర్‌ తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకుంటున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా కుటుంబపరంగా కేసీఆర్‌ ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

7 /7

సకలమ్మ అంత్యక్రియలకు కేసీఆర్‌ తన సతీమణి శోభతోపాటు కుమారుడు కేటీఆర్‌, కోడలు శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీశ్‌ రావు తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.