Three Days Wine Shops Close Check Here Dates: మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నఫళంగా ఎందుకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు? ఎప్పుడు? ఎక్కడ మూస్తున్నారో ఆ వివరాలు తెలుసుకోండి.
మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని చోట్ల మద్యం విక్రయాలు ఉండవని స్పష్టం చేసింది.
వరుసగా రెండు రోజులు.. ఆ తర్వాత మరో రోజు డ్రై డే ప్రకటించడంతో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. అయితే ఎక్కడ మద్యం దుకాణాలు బంద్ ఉంటాయో తెలుసా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. 70 ఎమ్మెల్యే స్థానాలకు ఫిబ్రవరి 5వ తేదీన పోలీంగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రెండు రోజులు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాల వెల్లడి రోజు కూడా మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
ఫలితాలు వెల్లడయ్యే ఫిబ్రవరి 8వ తేదీ కూడా మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. 48 గంటల పాటు ఆ తర్వాత ఫిబ్రవరి 8న కొన్ని గంటల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి హింస.. అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మద్యం దుకాణాలు మూతవేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.