Bandi Sanjay On Rahul Gandhi: మోదీ ఇంటిపేరున్న వాళ్లంతా దొంగలేనంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఓబీసీ సమాజాన్ని అవమానించారంటూ ఫైర్ అయ్యారు. తక్షణమే రాహుల్ గాంధీ చేసిన తప్పును ఒప్పుకుని ఓబీసీ సమాజానికి.. నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీలను అవమానించడం, కోర్టులను అవమానించడం, చట్టాన్ని ఉల్లంఘించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
'గతంలో ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూనే ఉన్నారు. కోర్టు తీర్పునిస్తే దానిని శిరసావహించకుండా జడ్జీలను కించపర్చడం ముమ్మాటికీ న్యాయ వ్యవస్థను అవమానించడమే. ప్రధాని నరేంద్ర మోదీని బదనాం చేయడం ద్వారా ఓబీసీలను కించపరుస్తున్నారు. దేశంలోని ఓబీసీలంతా జాగ్రుతం కావాలి. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో.. ఆయనకే తెలియడం లేదు.. గతంలో చౌకీదార్ చోర్ అంటూ వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు మెట్టికాయలు పెట్టింది. అయినా మారలేదు.. దురదృష్టవశాత్తు ఎంపీ అయ్యానంటూ అత్యున్నత పార్లమెంట్‌ను అవమానించిన వ్యక్తి రాహుల్ గాంధీ.
కాంగ్రెస్‌కు పట్టిన శని రాహుల్ గాంధీ. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. అయినా మారకుండా ఇతర దేశాలకు పోయి భారత్ ప్రతిష్టను కించపర్చచేలా మాట్లాడటం సిగ్గు చేటు. ఇకనైనా కోర్టు తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలి. లేనిపక్షంలో రాహుల్‌ను ఈ దేశ పౌరుడిగా సమాజం గుర్తించబోదు..' అని బండి సంజయ్ అన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించారు. 8 ఏళ్లుగా రైతులకు నయా పైసా సాయం చేయని కేసీఆర్ కేంద్రం పైసా ఇవ్వడం లేదని బదనా చేయడం సిగ్గు చేటని అన్నారు. 2016-17లో కేంద్రం రాష్ట్ర రైతులకు సాయం చేయాలని 916 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. అందులో 700 కోట్లు కూడా ఖర్చు చేయకుండా గండీ కొట్టి రైతులను మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ కేంద్రాన్ని సాయం అడిగితే పాత లెక్కలు అడుగుతదనే భయంతో కేసీఆర్ కేంద్రానికి నివేదికలు పంపడం లేదన్నారు. రైతుల పాలిట శని కేసీఆర్ అని.. గతంలో ఇచ్చిన ఫ్రీ యూరియా, రుణమఫీ హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
అకాల వానలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేస్తోందనడం పచ్చి అబద్దన్నారు బండి సంజయ్. నిన్న జారీ చేసిన జీవోలో ఎస్డీఆర్ఎఫ్ నిధులతోనే రైతులకు సాయం చేస్తున్నట్లు చెప్పారని.. మరి ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానిదే కదా.. ఆ మాట ఎందుకు చెప్పడం లేదు..? అని ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ మంచి చేస్తే వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, ఆయన కొడుకు కేంద్రంపై బదనాం మోపి తిట్టడం అలవాటైపోయిందన్నారు.
Also Read: Ajith Father Death : తలా ఇంట్లో విషాదం.. అజిత్ తండ్రి మరణం
Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి