Budhaditya Rajyog In Makar: గ్రహాల రాశి గమనంలో మార్పు వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అలాంటి యోగాల్లో ఒకటి బుధాదిత్య యోగం. మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత బధుడు కూడా అదే రాశిలోకి వెళతాడు. మకరరాశిలో సూర్య, బుధుల కలయిక వల్ల ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారు భారీ ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభ రాశి
బుధాదిత్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ సంచార జాతకంలో బుధుడు మరియు కుజుడు కలిసి నవపంచం యోగం సృష్టిస్తున్నారు. మీ తొమ్మిదవ ఇంటిలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మీరు ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్త ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
కన్య రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. జాబ్ ఛేంజ్ కావాలనుకుంటే ఇదే మంచి టైం. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
మేష రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారుల భారీగా లాభాలను గడిస్తారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీరు ఏ పని చేపట్టిన దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
మకర రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం మకర రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఎందుకంటే మీ రాశి యెుక్క లగ్నస్థ గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మెుత్తానికి ఈసమయం మీకు బాగుంటుంది.
Also Read: Shani Ast 2023: మార్చి 6 వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త... ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook