Budhaditya Rajyog In Capricorn 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశికి మారడం ద్వారా శుభ మరియు అశుభ యోగాన్ని సృష్టిస్తాయి. ఈనెల 07న గ్రహాల రాకుమారుడైన బుధుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే సూర్యుడు అదే రాశిలో సంచరిస్తున్నాడు. మకరంలో బుధ, సూర్యల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
వృశ్చిక రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం వృశ్చికరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి మూడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవి పొందే అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరోవైపు, సూర్యభగవానుడు మీ రాశి యెుక్క మూడవ ఇంట్లో బలంగా ఉన్నాడు. దీంతో మీరు విదేశాల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు కెరీర్లో పురోగతి సాధిస్తారు. సోదరసోదరీమణుల సపోర్టు లభిస్తుంది.
సింహ రాశి
బుధాదిత్య రాజయోగం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం బాగుంటుంది.
సింహ రాశి
బుధాదిత్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశితో ఈ యోగం ఆరవ ఇంట్లో ఏర్పడబోతోంది. అలాగే ఈ ఇంట్లో బుధుడు, సూర్యుడు బలంగా ఉన్నారు. అందుకే ఈ సమయంలో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. రోగం నుండి విముక్తి పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
Also Read: Surya Gochar 2023: మూడు దశాబ్ధాల తర్వాత కుంభంలో తండ్రీ కొడుకుల కలయిక.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook