Money Plant: మనీ‌ప్లాంట్ సూచనలు పాటిస్తే..ఇక డబ్బే డబ్బు, లెక్కపెట్టుకోవల్సిందే

Money Plant: వాస్తుశాస్త్రంలో మనీ‌‌ప్లాంట్ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను డబ్బులు కురిపించేదిగా భావిస్తారు. మనీ‌ప్లాంట్ మొక్క విషయంలో వాస్తుశాస్త్రం టిప్స్ గురించి తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2023, 08:25 AM IST
Money Plant: మనీ‌ప్లాంట్ సూచనలు పాటిస్తే..ఇక డబ్బే డబ్బు, లెక్కపెట్టుకోవల్సిందే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా నమ్మకాలుంటాయి. ధనవర్షం కోసం మనీ‌ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడాన్ని అత్యంత శుభసూచకంగా భావిస్తారు. ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా..ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. 

వాస్తుశాస్త్రంలో మనీ‌ప్లాంట్ మొక్కకు అత్యంత మహత్యముంది. ఈ మొక్క నాటడం వల్ల నెగెటివిటీ దూరమౌతుందని ప్రధాన నమ్మకం. పాజిటివ్ శక్తి ప్రసరిస్తుందంటారు. వాస్తుశాస్త్రంలో మనీ‌ప్లాంట్ మొక్క విషయంలో కొన్ని సూచనలున్నాయి. ఇవి తూచా తప్పకుండా పాటిస్తే ధనవర్షం సిద్ధిస్తుంది. 

మనీ‌ప్లాంట్ మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలోనే అమర్చాలి. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఎప్పుడూ అమర్చకూడదు. మనీ‌ప్లాంట్‌ను ప్లాస్టిక్ మెటీరియల్‌లో పెంచకూడదు. పచ్చరంగు గాజు లేదా మట్టి పాత్రలో పెంచాలి. 

మనీ‌ప్లాంట్ మొక్కను నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు. ఆధారం సహాయంతో పైకే ఎదగనివ్వాలి. శుక్రవారం రోజు మనీప్లాంట్ మొక్కలో పచ్చిపాలు కలిపిన నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 

మనీప్లాంట్‌లో ఎర్రరంగు రిబ్బన్ లేదా రేష్మీ దారం కట్టడం వల్ల కెరీర్‌లో మంచి ఉన్నత స్థానం లభిస్తుంది. పదోన్నతి కలుగుతుంది. దాంతోపాటు అంతులేని ధనం, అపారమైన కీర్తి లభిస్తాయి. మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టాలు తొలగిపోతాయి. వాస్తుశాస్త్రంపై నమ్మకముండేవాళ్లు మనీప్లాంట్ మొక్కను ఇంట్లో, ఆఫీసుల్లో తప్పనిసరిగా పెంచుకుంటుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం సరైన దిశలో అమర్చుకుంటే ఏ విధమైన ఇబ్బందులు దరిచేరవనేది నమ్మకం. అందుకే సాధ్యమైనంతవరకూ మనీప్లాంట్ మొక్కను దక్షిణ దిశలోనే అమర్చుకుంటారు. అదే సమయంలో తాడు లేదా ఏదైనా ఆధారం కల్పించడం ద్వారా పైకే ఎదిగేట్టు చూసుకోవాలి. 

Also read: Sun Transit 2023: సూర్యుడి గోచారంతో ఆ రాశివారికి జనవరి 14 నుంచి అంతా మారిపోతుంది, అప్పుల్నించి విముక్తి కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News