SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ

SBI Collateral Free Loans: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం సహాయక బృందాలకు గొప్ప అవకాశం అందిస్తోంది. ఈ స్వయం సహాయక బృందాలనే మన తెలుగు రాష్ట్రాల్లో సమభావన సంఘాలు పేరిట కూడా పిలుచుకుంటున్నాం. ఎలాంటి పూచికత్తు లేకుండానే రూ. 10 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది.

Written by - Pavan | Last Updated : Jan 3, 2023, 05:21 PM IST
SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ

SBI Collateral Free Loans: బయటి బ్యాంకులు అందించే వ్యాపార రుణాలు, పర్సనల్ లోన్స్‌తో పోల్చుకుంటే తక్కువ వడ్డీ రేటుకే అది కూడా ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఎస్బీఐ ఈ  రుణాలు అందిస్తుండటం విశేషం. 1 అక్టోబర్ 2022 నుండి ప్రారంభమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సమూహ శక్తి స్కీమ్ కింద ఎస్బీఐ ఈ రుణాలు అందిస్తోంది. 31 మార్చి 2023న ఈ స్కీమ్ ముగుస్తుంది.

SBI SHG సమూహ్ శక్తి క్యాంపెయిన్ కింద స్వయం సహాయక బృందాలు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 3 లక్షల వరకు రుణం పొందే స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రేటు 7 శాతం కాగా రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు రుణం తీసుకునే వారికి 1 సంవత్సరం MCLR రేటును వడ్డీ రేటుగా పరిగణిస్తారు. అలాగే రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకునే వారికి 9 శాతం వడ్డీ రేటుగా నిర్ణయించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ట్వీట్ ప్రకారం "ఎస్బీఐ స్వయం సహాయక బృందాలను శక్తివంతం చేసి వారి అవసరాలు తీర్చడంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు తన వంతు మద్దతు అందిస్తోంది. ఎస్బీఐ వెబ్‌సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం 31 మార్చి 2022 నాటికి 8.71 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.24,023 కోట్ల రుణాలు అందజేసిందని, అందులో 91%  మంది మహిళలే ఉన్నారని ఎస్బీఐ వెల్లడించింది. 

స్వయం సహాయక బృందాలకు ఆదాయం ఆర్జించే వ్యాపార కార్యకలాపాలు, గృహనిర్మాణం, వృత్తి, విద్య, వివాహం, రుణ మార్పిడి వంటి సామాజిక అవసరాలు తీర్చుకోవడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలు అందిస్తోంది. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ FIDD.GSSD.CO.BC. నం.09/09.01.003/2021-22 తేదీ 09 ఆగస్ట్ 2021 ప్రకారం దీనదయాల్ అంత్యోదయ అన్నయోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (DAY-NRLM) కింద స్వయం సహాయక బృందాలకు ఎలాంటి కొలేటరల్ సెక్యురిటీ లేకుండానే రుణాలను 10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచడం జరిగింది. నాబార్డ్ జారీ చేసిన కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం, స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా పొదుపు ఖాతా ఆధారంగా రుణాలను మంజూరు చేయవచ్చు. 

స్వయం సహాయక బృందాలకు ₹10.00 లక్షల పరిమితి వరకు ఎటువంటి పూచీకత్తు లేదా మార్జిన్ వసూలు చేయకుండానే అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ స్వయం సహాయక బృందాల సభ్యులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. బ్యాంకులు ఈ కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చే సమయంలో మీ బ్యాంకు పొదుపు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి వీలు లేదు. అంటే మీ పొదుపు ఖాతాలో డిపాజిట్ లేకున్నా మీ స్వయం సహాయక బృందాలకు కొలేటరల్ ఫ్రీ లోన్ ఇవ్వాల్సి ఉంటుందన్న మాట. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ అభ్యున్నతి కోసం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.

ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్‌యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్‌యూవి కారు ఏదో తెలుసా ?

ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి

ఇది కూడా చదవండి : RDE Norms in New Cars: ఈ కార్లను కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News