Roger Binny to replace Sourav Ganguly as BCCI president post: టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపుగా ఖాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ పదవి చేపట్టడం లాంఛనమే కానుందట. ఇక ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా.. అదే స్థానంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
సోమవారం ముంబైలో బీసీసీఐ అంతర్గత సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపిక ఖాయం అయినట్లు వార్తలు బయటికి వచ్చాయి. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. మెగా టోర్నీలో ఆల్‌రౌండర్ పాత్రను బిన్నీ పోషించారు. ప్రస్తుతం ఆయన కర్నాటక క్రికెట్ సంఘంలో ఆఫీసు బేరర్‌గా కొనసాగుతున్నారు. గతంలో బీసీసీఐ సెలక్షన్ సభ్యుడిగా కూడా ఉన్నారు.
బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 18వ తేదీన జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళ, బుధవారాల్లో (11-12) తేదీల్లో జరుగుతుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ వరకు తుది గడువు. బీసీసీఐ కార్యదర్శిగా జై షానే ఎంపిక కానున్నారు. బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్ శుక్లా రేసులో ఉన్నాడు. జాయింట్ సెక్రెటరీ పోస్టుకు దేబోజిత్ సైకియా, రోహన్ జైట్లీలు పోటీ పడే అవకాశం ఉంది. ఇక లీగ్ క్రికెట్ ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్ ఎంపిక కావచ్చని సమాచారం.
Also Read: Rahul Koli Dies: ఆస్కార్ రేసులో ఉన్న 'ఛెల్లో షో' సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ మృతి!
Also Read: బౌలింగ్ ఎంచుకున్న భారత్.. రాహుల్, త్రిపాఠికి నిరాశే! కెప్టెన్ మళ్లీ మారాడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook