Gold prices today: బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. శుక్రవారం బంగారం ధరలు రూ. 650 మేరకు పెరిగాయి. గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450 ఉండగా శుక్రవారం ఆ ధర అమాంతం 47,100 కు పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలు 50,680 కాగా నేడు మేలిమి బంగారం ధరలు 51,380 కి పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పడిపోయాయి. యూఎస్ బాండ్ ఈల్డ్స్, వివిధ దేశాల సెంట్రల బ్యాంకులు తీసుకున్న కఠినమైన మానిటరీ పాలసీల నిర్ణయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు గురవడమే అందుకు కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం ధరల వివరాలు వివిధ నగరాల వారీగా ఇలా ఉన్నాయి.
చెన్నై : రూ 47,670
ముంబై : రూ. 47,100
ఢిల్లీ : రూ 47,250
కోల్‌కతా : రూ 47,100
హైదరాబాద్ : రూ 47,100
బెంగళూరు : రూ 47,150
కేరళ : రూ 47,100
అహ్మెదాబాద్ : రూ 47,150
జైపూర్ : రూ 47,250
లక్నో : రూ 47,250
పాట్నా : రూ 47,130
చండీఘడ్ : రూ 47,250
భువనేశ్వర్ : రూ 47,100
బంగారం ధరల బాటలోనే వెండి ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు రూ. 55,602 గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ. 1,335 మేర పెరిగి రూ. 56,937 కి చేరింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
Also Read : August Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook