Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.గత 24 గంటల్లో కొత్తగా 6 వేల 594 మంది వైరస్ నిర్దారణ అయింది. నిన్నటి పోల్చితే కేసులు తగ్గినా.. ఇవాళ వచ్చిన కేసుల వివరాలు ఆదివారం రోజువి. ఆదివారం మిగితా రోజులతో పోలిస్తే టెస్టుల సంఖ్య భారీగా తగ్గుతుంది. అందుకే మంగళవారం విడుదలయ్యే రిపోర్టులో కేసులు తక్కువగా ఉంటుంటాయి.
రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా వస్తుండటంతో దేశంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా రిపోర్టు ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంట్లలో వైరస్ భారీన పడి మరో 10 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.68 శాతంగా ఉండగా.. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
India reports 6,594 #COVID19 cases, as active cases rise to 50,548. Daily positivity reduces to 2.05%. pic.twitter.com/ePzkfgI4hu
— ANI (@ANI) June 14, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook