NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... తెలుగు ప్రజలకు ఆర్బీఐ శతకోటి కానుక

NTR: తెలుగు ప్రజలందరికి ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఉన్న కలను సాకారం చేసింది.

Written by - Srisailam | Last Updated : Jun 10, 2022, 10:23 AM IST
  • వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ
  • ఆర్బీఐ అంగీకరించిందన్న పురంధేశ్వరి
  • ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు
NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ... తెలుగు ప్రజలకు ఆర్బీఐ శతకోటి కానుక

NTR: తెలుగు ప్రజలందరికి ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఉన్న కలను సాకారం చేసింది. తెలుగు ప్రజలు యుగ పురుషుడుగా పిలుచుకునే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్‌బీఐ అంగీకరించింది. ఈ విషయాన్ని తిరుపతిలో తెలిపారు ఎన్టీఆర్ కూతురు, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి. ఆర్బీఐ నిర్ణయంతో త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న నాణెం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.  

వంద రూపాయల నాణెంపై అన్నగారి బొమ్మ ముద్రించడంపై సంతోషం వ్యక్తం చేసిన పురంధేశ్వరి.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు తిరుపతి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమని.. రాజకీయ ప్రస్తానాన్ని ఆయన తిరుపతి నుంచే ప్రారంభించారని గుర్తుచేశారు. తిరుపతిలో జరిగిన ఎన్టీఆర్  శత జయంతి ఉత్సవాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరుకావడం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు పురంధ్వేశ్వరి.

ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ జయంతి రోజున శత జయంతి ఉత్సవ ఏర్పాట్లను తెలిపారు పురంధేశ్వరి. ఇందుకోసం ప్రత్యేక కమిటిని కూడా నియమించారు. ఆ కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరికొందరు ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను కమిటీలో నియమించారు. జాస్తి చలమేశ్వరరావు వంటి ప్రముఖుల సలహాలు, సూచనలతో ఏడాది పాటు వైభవంగా వేడుకలు జరుపుతామన్నారు. ఏపీ, తెలంగాణలోని 12 ప్రధాన పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, విజయవాడల్లో మెగా ఈవెంట్స్ కు ప్లాన్ చేస్తున్నారు. వివిధ రంగాల్లోని  నిష్ణాతులను ఎంపిక చేసి ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ శత జయంతి వేడుకలకు రావాలని పురంధేశ్వరి ఆహ్వానించారు.

READ ALSO: President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఉంటారా? కేసీఆర్ నిలబెట్టేదీ ఆయననేనా? 

READ ALSO: Nayanthara-Vignesh Wedding: మేడమ్‌ నుంచి.. సతీమణి అయ్యారు! నయనతార అనుబంధంపై విఘ్నేశ్‌ పోస్ట్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News