Irfan Pathan named his best playing XI of the IPL 2022: క్రికెట్ అభిమానులను రెండు నెలలుగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ ముగిసిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభం నుంచి గొప్ప ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ 2022 టైటిల్ గెలుచుకుంది. మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. మరోవైపు అన్ క్యాప్డ్ ప్లేయర్లు అద్భుత ఆటతో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ 2022లో అత్యుత్తమ ప్లేయర్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్ టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు.
జోస్ బట్లర్, కేఎల్ రాహుల్‌లను ఇర్ఫాన్ పఠాన్ తా జట్టుకు ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2022లో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో బట్లర్ 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ అత్యధిక రన్స్ చేసిన జాబితాలో 616 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. సంజూ శాంసన్‌ను మూడో స్థానం కోసం ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు ఫైనల్స్‌లోకి వచ్చేందుకు సంజూ తన జట్టును అద్భుతంగా నడిపించాడు. మరోవైపు జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్‌లను ఇర్ఫాన్ పఠాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎంచుకున్నాడు. పాండ్యా తన జట్టుకు టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. పాండ్యాను తన జట్టుకు కెప్టెన్ గా పఠాన్ ఎంచుకున్నాడు. లివింగ్‌స్టోన్, మిల్లర్‌లు హిట్టర్లుగా రాణించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో రాణించిన రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చహల్‌లను బౌలింగ్ విభాగంలో ఎంచుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ 12వ ప్లేయర్. గుజరాత్ నుంచి నాలుగు ప్లేయర్స్ ఎంపికయ్యారు.
ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ జట్టు:
జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్ (కుల్దీప్ యాదవ్-12వ ఆటగాడు).
Also Read: Umran Malik: ఐపీఎల్ 2022 అవార్డుల ద్వారా.. ఉమ్రాన్ మాలిక్ ఎంత సంపాదించాడో తెలుసా?
Also Read: IPL 2022 Final: అతడు ఖచ్చితంగా టీమిండియా కెప్టెన్ అవుతాడు: సునీల్ గవాస్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook