TSPSC Group-1 2022 Application last date: తెలంగాణ ఏర్పడ్డాక తొలి నోటిఫికేషన్ కావడంతో గ్రూప్-1 పోస్టులకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు (TSPSC Group-1 2022) సోమవారం రాత్రి 10 గంటల వరకు 2,94,644 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజే చివరితేదీ కావడంతో వీటి సంఖ్య 3 లక్షలు దాటే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు 312 పోస్టులకు గానూ 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు.
ఇవాళే లాస్ట్ డేట్ కావడంతో (TSPSC Group-1 2022 Application last date) అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుకు పోటెత్తుత్తున్నారు. ఇప్పటి వరకు రోజుకు సగటున 10వేల దరఖాస్తులు వస్తే...సోమవారం ఒక్కరోజే 32 వేల అప్లికేషన్లు రావడం విశేషం. దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు నుంచి కమిషన్ కు విన్నపాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1కు సంబంధించి మార్కెట్లో మెటీరియల్ సిద్ధంగా లేకపోవడం, తెలుగు అకాడమీలో పుస్తకాల కొరత వేధిస్తుండటంతో సన్నద్ధం అయ్యేందుకు కనీసం 3 నెలలైనా సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Also Read; TS Inter Board: ఏ సబ్జెక్ట్‌ను తొలగించడం లేదు..తెలంగాణ ఇంటర్ బోర్డు క్లారిటీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook