Vijayasai Reddy Resigns YSRCP: వైసీపీలో రిజైన్ల మంట.. కూటమికే రాజ్యసభ సీట్లు..?

Vijayasai Reddy Resigns YSRCP: కాలం కలిసి రాకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. తాజాగా అధికారంలో నుంచి ప్రతిపక్షా హోదా కూడా దక్కని వైసీపీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైయస్ఆర్సీపీ తరుపున ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు.. ఏకంగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 25, 2025, 01:05 AM IST
Vijayasai Reddy Resigns YSRCP: వైసీపీలో రిజైన్ల మంట.. కూటమికే రాజ్యసభ సీట్లు..?

Vijayasai Reddy Resigns YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం (ఈ రోజు) ఉదయం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు.

మరోవైపు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అటు గొల్ల బాబూరావు సైతం వైఎస్‌ఆర్‌సీపీకి బై బై  చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తున్నాయి.

ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి తన రాజీనామా ప్రకటన చేశారు.  రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు (శనివారం) 25వ తేదీన రాజీనామా చేయబోతున్నట్టు చెప్పారు. ఏ రాజకీయపార్టీలో చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి రాజీనామా చేరడం లేదన్నారు.  ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అన్నారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని అని చెప్పుకొచ్చారు. జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పారు విజయసాయి రెడ్డి.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

దాదాపు తొమ్మిదేళ్లు తనను  ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించాను. కానీ చంద్రబాబు కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం అని విజయసాయి స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకి, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని  విజయసాయి రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు.తాజాగా విజయసాయి రాజీనామాతో ఆ సీటుకు కూడా కూటమికే దక్కబోతుంది. మొత్తంగా ఎన్నికలు జరిగిన ఎనిమిది నెలల్లో కూటమికి ఇప్పటికే మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి. తాజాగా విజయసాయి రెడ్డి  రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కబోతుంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News