Ys Jagan Strategy: ఇవాళ వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పార్టీ రాజ్యసభ సభ్యుడు, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ సాయి రెడ్డి పార్టీకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.స్వయంగా ఆయనే ఈ ప్రకటన చేయడంతో రాజకీయంగా కలకలం మొదలైంది. జగన్‌కు షాక్ అని కొందరు చెబుతున్నా..అంతా వ్యూహమేనని మరి కొందరి వాదన.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరనని. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షాలకు వ్యతిరేకం కాదన్నారు. ఇప్పటి వరకూ తనకు అత్యున్నత పదవితో గౌరవించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వ్యవసాయం చూసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ పరిణామం వైసీపీకు, ముఖ్యంగా జగన్‌కు ఎదురుదెబ్బని కొందరి వాదన. కానీ నిశితంగా గమనిస్తే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరగుతోందని తెలుస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు తెలియకుండా జరగదని, భవిష్యత్ వ్యూహం ఉందనే వాదన వస్తోంది.
ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు అధికారం కోల్పోయినప్పుడు ఇదే ప్లాన్ అమలు చేశారు. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌లు చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా బీజేపీలో చేరి పదవిని కొనసాగించుకున్నారు. ఆ తరువాత తిరిగి టీడీపీ గూటికి వచ్చి పదవులు పొందారు. ఇప్పుడు జగన్ విదేశీ పర్యటనలో ఉండగా ఇదే రిపీట్ అవుతోంది. విజయసాయి రెడ్డి తరువాత మరో ఇద్దరు ముగ్గురు వైసీపీకి రాజీనామా చేసే పరిస్థితి ఉందని సమాచారం. అయోధ్య రామిరెడ్డి పేరు విన్పిస్తున్నా..ఆయనైతే ఖండించారు.
వ్యూహమేంటి
ప్రస్తుతం వైసీపీకు ఉన్న బలం రాజ్యసభ. కేంద్రంలో బీజేపీకు రాజ్యసభలో బలం కావాలంటే మొన్నటివరకూ వైసీపీనే ఆదుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నందున బీజేపీకి నేరుగా మద్దతిచ్చే పరిస్థితి లేదు. అందుకే విజయసాయి రెడ్డి సహా మరి కొందరు రాజీనామా చేస్తే కచ్చితంగా ఆ స్థానాలు బీజేపీ లేగా కూటమి ఖాతాలో చేరుతాయి. ఇప్పటి వరకూ వైసీపీకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా అందులో రెండు స్థానాలు బీజేపీకు ఒకటి టీడీపీకు దక్కింది. అంటే పరోక్షంగా వైసీపీ రాజ్యసభలో తన బలం తగ్గించుకుని బీజేపీ లేదా కూటమి బలం పెంచుతుంది. అంటే బీజేపీకు పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందే ప్రయోజనం. అందుకే ప్లాన్ ప్రకారమే అంతా నడుస్తోందనే వాదన గట్టిగా విన్పిస్తోంది.
Also read: Vijayasai Reddy Resigns YSRCP: వైసీపీలో రిజైన్ల మంట.. కూటమికే రాజ్యసభ సీట్లు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి