Conjoined Twins Vote: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. మూడవ దశలో పంజాబ్ ఎన్నికలు ముగియడమే కాకుండా ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది.
దేశంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్న ఉత్తరప్రదేశ్ మూడవ దశ పోలింగ్ పూర్తయింది. అటు పంజాబ్ రాష్ట్రంలో ఒకేదశలో నిన్న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. 65 శాతం పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో 1304 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, ఇందులో 93 మహిళలు కాగా మరో ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తం 5 రాష్ట్రాలతో పాటు మార్చ్ 10వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
మరోవైపు పంజాబ్ ఎన్నికల సందర్భంగా దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని సరికొత్త అధ్యాయం ఆవిష్కారమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా అవిభక్త కవలలకు ఓటు హక్కు కల్పించారు. ఆ ఇద్దరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవిభక్త కవలలైన సోహ్నా సింహ్, మోహ్నా సింగ్‌లకు పంజాబ్ ఛీప్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ రెండు వేర్వేరు ఓటర్ ఐడీ కార్టులు జారీ చేశారు. ఇద్దరినీ వేర్వేరు ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. అమృతసర్‌లోని మనావాలాలో తొలిసారిగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇద్దరి ఓట్ల మద్య గోప్యత కూడా పాటించారు. పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకరి ఓటు మరొకరికి కన్పించకుండా నల్లటి కళ్లద్దాలు అందించారు. ఓటేసే క్రమంలో వీడియోగ్రఫీ తీశారు. 2003 జూన్‌లో ఢిల్లీలో జన్మించిన ఈ అవిభక్త కవలల్ని తల్లిదండ్రులు వదిలేయడంతో..అమృతసర్‌లోని ఓ అనాథ శరణాలయం దత్తత తీసుకుంది. ఈ ఇద్దరూ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగులు కూడా.
Also read: Priyanka Gandhi: సామాన్యులకు సేవ చేయడం బీజేపీ ఎప్పుడో మరిచిపోయింది.. వారి కోసం మాత్రమే పనిచేస్తోంది: ప్రియాంక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook