Delhi Elections 2025: ఈ బుధవారం (ఫిబ్రవరి 5న) ఢిల్లీ అసెంబ్లికి ఎన్నికలు జరగనున్నాయి. గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పోటీ పడుతోంది. ఈ ఎన్నికల సంబంధించిన ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక 1993 తర్వాత ఢిల్లీ పీఠం కోసం బీజేపీ చకోరా పక్షిలా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 24 గంటల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా పలు చర్యలకు ఉపక్రమించింది.
అయితే ఎన్నికల్లో గెలుపు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పలు హామిలను గుప్పించింది.మరోవైపు గత రెండున్నర దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత తాయిలాలు ప్రకటించింది. 2013 ఎన్నికల ముందు వరకు షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 15 యేళ్లు అధికారం చెలాయించింది. మరోసారి తమకు అధికారం ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తోంది.
ఎలక్షన్ కమిషన్ ప్రకారం.. దేశ రాజధానిలో 1.56 కోట్ల మంది ఓటు హక్కు ఉంది. వీరి కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ తో పాటు దివ్యాంగులు దాదాపు 7980 మంది తమ ఓటు హక్కును యూజ్ చేసుకున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
దేశ రాజధానిలో పోలింగ్ నేపథ్యంలో 200 పైగా కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించారు. 35 వేల మంది పైగా ఢిల్లీ పోలీసులతో పాటు, 15 వేల మంది హోం గార్డులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. మొత్తం పోలింగ్ బూతుల్లో 3 వేలకు అతి సున్నితమైన ప్రాంతాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రకారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంిచ ఇప్పటి వరకు వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే లక్ష లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడంతో పాటు 1353 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రూ. 77 కోట్ల విలువైన 196 కిలోల డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేసారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.