Kangana Ranaut Freedom 2014: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut News) వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తప్పుబట్టారు. దేశానికి 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్ష అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆమె వ్యాఖ్యలపై (CPI Narayana Comments On Kangana Ranaut) మండిపడ్డారు. కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు (Kangana Is A Luxurious Beggar) అంటూ విమర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణ.. కంగనా రనౌత్ కు పద్మశ్రీ అవార్డు (Padma Shree award) ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని (CPI Narayana) అన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంపై మాట్లాడే అర్హత ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ (BJP, RSS)లకు కూడా లేదన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని (PM Narenda Modi) అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం ఆమె బానిసత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆమె తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) హెచ్చరించారు.
Clasical beggar kangana rounath pic.twitter.com/nt4jKHQjOq
— Narayana Kankanala (@NarayanaKankana) November 11, 2021
“విలాసవంతమైన యాచకురాలు ఎవరంటే ఇటీవలే పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె కళాకారిణి.. కళామతల్లికి సేవ చేస్తోంది. ఆమెకు పద్మశ్రీ ఎందుకిచ్చారో అర్థమైంది. ఆమెకు స్వాతంత్ర్య పోరాటం గురించి ఆమెకు తెలియదు. భాజపా, ఆర్ఎస్ఎస్లకు అసలు తెలియదు. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్ష అని.. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందనడం అంతకంటే బానిసత్వం మరొకటి లేదు. నువ్వు అడుక్కుంటే అడుక్కో అంతే కానీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హత మీకు గానీ.. మీకు బిరుదు ఇచ్చిన వారికి కూడా లేదు. ఇంతకు మించిన దరిద్రం మరొకటి లేదు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె తప్పకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని సీపీఐ నారాయణ అన్నారు.
అయితే స్వాతంత్ర్యంపై నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశమంతా దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యల పట్ల పలువురు చింతిస్తుండగా.. అనేక మంది ఖండిస్తున్నారు.
Also Read: Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read: Covaxin: కొవాగ్జిన్ తీసుకున్న వారికి విదేశీ ప్రయాణాలు ఈజీ- టీకా సామర్థ్యం 77.8 శాతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Kangana Ranaut Freedom 2014: కంగనా రనౌత్ ఓ బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు