Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్

Australia Vs Pakistan: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) రెండో సెమీఫైనల్ లో  పాకిస్తాన్ టీమ్ పై అద్భుతమైన విజయం సాధించింది ఆస్ట్రేలియన్ టీమ్. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత  మ్యాచ్ లో తప్పిదాలు చేసిన పలు పాక్ క్రికెటర్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే మ్యాచులో అత్యంత చెత్త బంతి వేసిన బౌలర్ గా పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez News) నిలిచాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 10:35 AM IST
Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్

Australia Vs Pakistan: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) సెమీ-ఫైనల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ (Aus Vs PAK) లో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది.  కీలక మ్యాచులో గల్లీ క్రికెట్ లో బౌలింగ్ చేసినట్లు బంతిని విసిరాడు. అలాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఇలాంటి చెత్త బంతిని విసరడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆసీస్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో 8వ ఓవర్ బౌలింగ్ చేసిన మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez News).. విసిరిన రెండు స్టెప్పుల బంతిని డేవిడ్ వార్నర్ (David Warner Best Innings) సిక్సర్ గా మలిచాడు. ఈ బంతిని చూసిన ప్రేక్షకులతో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు షాక్ అయ్యారు. అయితే ఈ బాల్ ను అంపైర్ నో-బాల్ గా ప్రకటించాడు. బౌలింగ్ లో ఇలాంటి పొరపాటు చేసిన తర్వాత కూడా అంపైర్ తో హఫీజ్ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. 

ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు గురువారం తలపడ్డాయి. ఈ మ్యాచులో సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసింది పాకిస్తాన్ టీమ్. అయితే 8వ ఓవర్ బౌలింగ్ వేసేందుకు మహ్మద్ హఫీజ్ వచ్చాడు. అయితే డ్యూ కీలక పాత్ర పోషించడంతో స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. అయితే బంతి హఫీజ్ చేతిని వదిలి మిడిల్ పిచ్‌పై రెండు స్టెప్పులు పడుతూ వైడ్‌గా వెళ్లబోయింది. దీంతో ఎలాగైన ఆ బంతిని బాదాలనుకున్న డేవిడ్ వార్నర్.. ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదేశాడు. వార్నర్ కొట్టిన ఈ షాట్ తర్వాత హఫీజ్ అంపైర్‌తో వాగ్వాదం ప్రారంభించాడు. బంతి తన చేతి నుంచి జారిపోయిందని, అందుకే ఈ బంతిని డెడ్‌గా ప్రకటించాలని, అయితే ఆ నిర్ణయం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. అయితే అంపైర్ మాత్రం ఈ బంతిని ‘నో బాల్’ అని ప్రకటించి బౌలర్‌కు షాక్ ఇచ్చాడు.

ఫైనల్ కు చేరిన ఆస్ట్రేలియా..

టీ20 వరల్డ్ కప్ లో గురువారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్​లో పాకిస్తాన్​పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్ (T20 World Cup 2021 Final)​ చేరింది ఆస్ట్రేలియా జట్టు. గ్రూప్​ దశలో ఒక్క మ్యాచ్​ కూడా ఓడకుండా.. దూకుడుగా ఆడిన పాకిస్తాన్​కు సెమీస్​లో మాత్రం ఓటమి తప్పలేదు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. పాకిస్థాన్​ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా ఒక ఓవర్​ మిగిలి ఉండగానే విజయం తన ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా టీమ్​. ముందు రోజు ఇంగ్లాండ్​పై, న్యూజిలాండ్​ ఎలా అనూహ్య విజయం సాధించిందో.. అంతకన్నా ట్విస్ట్​లతో పాకిస్థాన్​పై ఆస్ట్రేలియా గెలిచింది.  

Also Read: Rohit or Rahane: టీమ్​ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎంపిక కోసం బీసీసీఐ కసరత్తు! 

Also Read: PAK vs AUS: పాకిస్థాన్​పై అద్భుత విజయంతో ఫైనల్​కు చేరిన ఆస్ట్రేలియా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News