Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు

దీపావళి పండుగ దీపాల పండగ అని అర్థం.. టపాసులు కాల్చటం కూడాఒక ఆనవాయితీగా మారింది. కానీ టపాసులు కాల్చటంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 04:02 PM IST
  • చేతులకు శానిటైసజర్లు పూసుకొని టపాసులు కాల్చవద్దు
  • టపాసులని కాల్చేపుడు కాటన్ బట్టలను ధరించండి
  • టపాసులను కాల్చేపుడు కళ్లజోడు ధరించటం చాలా మంచిది
Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు

Deepavali 2021 Safe Tips: వెలుగు దివ్వెల పండగ దీపావళి. విజయానికి ప్రతీకగా, చీకటిపై వెలుతురు సాధించిన విజయంగా ఈ పండగ గురించి చెబుతారు. సాయంత్రం వేళ ఇల్లంతా దీపాలతో అలంకరించి పండగ జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల పండగే అయినా... ఆరోజు టపాసులు కాల్చడం కూడా ఒక సాంప్రదాయంలా మారిపోయింది. ఇంటిల్లి పాదీ టపాసులు కాలుస్తూ పండగను సంబరంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పిల్లలు టపాసులు కావాలని మారాం చేసినా... భారీ శబ్దాలు రాని, పర్యావరణానికి తక్కువ హాని చేసే టపాసులు మాత్రమే కాల్చాలి.

దీపావళి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు:

1) దీపావళి రోజు సాధారణ క్రాకర్స్ కాకుండా పర్యావరణహితమైన గ్రీన్ కాకర్స్ వాడితే మంచిది.

Also Read: Viral Video: దీని హొయలు కాకెత్తుకెళ్లా.. 'క్యాట్ వాక్‌తో' అదరగొట్టేసిన కాకి.. వైరల్ వీడియో

2) చేతులకు శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం చేయవద్దు. అలా చేస్తే చేతులు కాలిపోయే ప్రమాదం ఉంది.

3) పండగ పూట చాలామంది ఎథ్నిక్ వేర్ ధరిస్తారు. అయితే టపాసులు పేల్చే సమయంలో మాత్రం కాటన్ దుస్తులను ధరించడమే మంచిది. టపాసులు కాల్చే సమయంలో ప్రమాదవశాత్తు దుస్తులకు మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. కాటన్ మినహా ఇతర వస్త్రాలకు త్వరగా మంటలు అంటుకుంటాయి. కాబట్టి కాటన్ దుస్తులు ధరించడం మంచిది.

4) టపాసులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి వద్ద పేల్చవద్దు. కాస్త దూరంగా బహిరంగ ప్రదేశంలో టపాసులు కాల్చే ఏర్పాటు చేసుకోండి.

5) టపాసులు కాల్చిన వెంటనే... ఒకవేళ అది పేలకపోతే వెంటనే దాని వద్దకు వెళ్లి పరీక్షించవద్దు. అది అకస్మాత్తుగా పేలితే గాయపడే ప్రమాదం ఉంటుంది.

Also Read: Viral Video : ఎగసిపడిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. పిల్లలను ఓ కంట కనిపెట్టండి

6) యాంటీ సెప్టిక్ లోషన్లు, బ్యాండ్ ఎయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ డ్రగ్స్ అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడినా వెంటనే ప్రథమ చికిత్స చేయవచ్చు.

7) మద్యం సేవిస్తూ బాణసంచా కాల్చవద్దు. మద్యానికి మండే గుణం ఉంటుందనే విషయం మరవద్దు.

8) భారీ శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చవద్దు. చిన్నపిల్లలు, వృద్దులు ఆ శబ్దాలను తట్టుకోలేరు.

9) టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం మంచిది. తద్వారా నిప్పు రవ్వలు కళ్లలో పడకుండా ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News