Double Bedroom Houses In Telangana: ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు అర్ములైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై తెలంగాణ సర్కారు ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ గత మూడు రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తూ కలెక్టర్ కార్యాలయాలు, ఎమ్మెల్యే ఆఫీసులు ప్రారంభిస్తున్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామంలో తెలంగాణ సర్కార్ ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double BedRoom Houses) నిర్మించింది. మొత్తం రూ.1.20 కోట్ల నిధులతో 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నాడు నిర్వహించారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఖమ్మం కలెక్టర్, ఉన్నతాధికారులు, పలువురు స్థానిక టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read: Hyderabad bonalu: గోల్కోండ బోనాలకు తేదీలు ఖరారు
#TELANGANA ప్రభుత్వం, @TelanganaCMO కేసీఆర్ గారి సహకారంతో #Khammam జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి(మం) రేలకాయలపల్లి గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన 24డబుల్ బెడ్ రూం ఇళ్లను @mlawyra రాములు నాయక్ గారితో కలిసి ప్రారంభించడమైంది.@MinisterKTR @KTRTRS @DayakarRao2019 @Collector_KMM pic.twitter.com/AQGeZGfACf
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) June 23, 2021
కాగా, తెలంగాణలో ఇటీవల రైతు బంధు నగదు పంపిణీ కార్యక్రమం మొదలైంది. వర్షాకాలానికిగానూ అన్నదాతలకు విత్తనాల కొనుగోలుకు ఆర్థిక చేయూతలో భాగంగా రైతులకు రూ.5 వేల మేర నిధులు విడుదల చేశారు. ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలకు నగదు జమ కార్యక్రమంలో పది రోజులపాటు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కుగానూ ఆర్థిక సాయం తాజాగా అందిస్తుండగా, అనంతరం రబీ సీజన్‌కు సైతం టీఆర్ఎస్ సర్కార్ (Telangana CM KCR) మలి విడతలో మరో రూ.5 వేలను రైతులకు అందిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook