AP Corona Update: కరోనా మహమ్మారి నెమ్మదిగా శాంతిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అటు కరోనా నిర్ధారణ పరీక్షల్ని ప్రభుత్వం పెంచుతోంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోంది. ఏపీలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 88 వేల 441 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..10 వేల 373 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే పరిస్థితి కొద్దిరోజుల క్రితం 20 వేల వరకూ ఉండేది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోవిడ్ కేర్ సెంటర్లలో 12 వేల 247 మంది ఉన్నారు. గత 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి 15 వేల 958 మంది కోలుకున్నారు. మరోవైపు 80 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 11 వేల 376 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 17 లక్షల 46 వేల 468 మందికి కరోనా సోకింది. ఏపీలో ప్రస్తుతం 1 లక్షా 28 వేల 108 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో అత్యధికంగా 1 కోటి 97 లక్షల 8 వేల 31 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు.
Also read: Tadipatriలో 500 పడకల COVID-19 Hospital ప్రారంభించిన ఏపీ సీఎం YS Jagan
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook